బడ్జెట్ సమావేశాలపై జగన్ సర్కార్ కసరత్తు

ప్రస్తుతం ఏపీలో స్థానిక ఎన్నికల చర్చ జోరుగా సాగుతుంది. అదే సమయంలో 2020 బడ్జెట్ సమావేశాలపై కూడా కొంత మేర చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముందా.. లేక బడ్జెట్ సమావేశాలు ముందా.. అనే విషయంపై జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. మొదట బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, తర్వాత స్థానిక ఎన్నికలకు పచ్చ జెండా ఊపనుంది ఏపీ ప్రభుత్వం ఇందుకు సంబంధిచిన షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. మార్చి 6వ తేదీ నుంచి బడ్జెట్ […]

Written By: Neelambaram, Updated On : February 29, 2020 4:33 pm
Follow us on


ప్రస్తుతం ఏపీలో స్థానిక ఎన్నికల చర్చ జోరుగా సాగుతుంది. అదే సమయంలో 2020 బడ్జెట్ సమావేశాలపై కూడా కొంత మేర చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముందా.. లేక బడ్జెట్ సమావేశాలు ముందా.. అనే విషయంపై జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది.

మొదట బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, తర్వాత స్థానిక ఎన్నికలకు పచ్చ జెండా ఊపనుంది ఏపీ ప్రభుత్వం ఇందుకు సంబంధిచిన షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. మార్చి 6వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, మార్చి 9వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.

స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల పై పెద్ద రచ్చ జరగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 20వ తేదీన రిజర్వేషన్ల నోటిఫికేషన్ జారీచేసి.. మార్చి 15 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాలని సీఎం జగన్ అనుకుంటున్నారు. అయితే ఎన్నికల ముందే బడ్జెట్ ప్రవేశపెడితే ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడే అవకాశం ఉంటడటంతో.. ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ బడ్జెట్ సమావేశాలపై మార్చి 4వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించి.. సమావేశాల తేదీని ఖరారు చేయనున్నారు.