చిన్న పరిశ్రమలకు జగన్ ప్రభుత్వం రాయితీలు

ఆంధ్ర ప్రదేశ్ లో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా నెల రోజులుగా కరోనా వల్ల మూతపడి ఉరడడంతో వాటిని ఆదుకునేరదుకు వడ్డీ రాయితీని అమలు చేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. పెట్టుబడి రుణంగా తీసుకున్న మొత్తంపై ఆరు నెలలపాటు మూడు నుండి తొమ్మిది శాతం వరకు వడ్డీ రాయితీ ఇవ్వాలని చూస్తున్నారు. 2015 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు మధ్య కాలంలో ఉత్పత్తి ప్రారంభిరచిన సంస్థలకు […]

Written By: Neelambaram, Updated On : April 22, 2020 4:46 pm
Follow us on


ఆంధ్ర ప్రదేశ్ లో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా నెల రోజులుగా కరోనా వల్ల మూతపడి ఉరడడంతో వాటిని ఆదుకునేరదుకు వడ్డీ రాయితీని అమలు చేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. పెట్టుబడి రుణంగా తీసుకున్న మొత్తంపై ఆరు నెలలపాటు మూడు నుండి తొమ్మిది శాతం వరకు వడ్డీ రాయితీ ఇవ్వాలని చూస్తున్నారు.

2015 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు మధ్య కాలంలో ఉత్పత్తి ప్రారంభిరచిన సంస్థలకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తింప చేయాలని చూస్తున్నారు. మిగిలిన సంస్థలకు ఆరు నెలలపాటు వడ్డీ రీయిరబర్స్‌మెరట్‌ అమలు చేసేందుకు ఆలోచిస్తున్నారు. దీనికోసం రూ 200 కోట్లు నిధిగా సమకూర్చాలని, ఇందుకు బ్యారకుల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు.

మొత్తం పది వేల జనుడికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని, రూ 140 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అలాగే ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు కావాల్సిన పెట్టుబడులను ఆరు శాతం వడ్డీపై బ్యాంకులకు తన హామీతో రుణాలను ఇప్పించేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.