ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటిసారిగా అంతర్జాతీయంగా తీవ్రమైన ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ అల్లర్లు పౌరసత్వ చట్టం అంశాలపై గతంలో ఎన్నడూ లేని విధంగా పలు దేశాలలో రాజకీయ వర్గాల నుండి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో ఒక అధ్యక్ష అభ్యర్థితో పాటు, కొందరు సెనేటర్లు కూడా ఈ అంశాలను ప్రస్తావించారు. ఐరోపా యూనియన్ పార్లమెంట్ లో ఈ అంశంపై తీర్మానంపై ప్రయత్నం జరుగుతున్నది.
ఇప్పటి వరకు ఇంతటి ప్రతికూలతను ఆయన ఎన్నడూ ఎదుర్కొనలేదు. అంతర్జాతీయ మీడియాలో మొదటిసారిగా విస్తృతంగా మోదీ నేతృత్వంలో భారత్ లో `హిందూ రాజ్యం’ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటూ నిశితంగా విమర్శిస్తూ కధనాలు వచ్చాయి.
ఢిల్లీ అల్లర్ల సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, నిందితుల పట్ల పక్షపాతంతో వ్యవహరించారని అంటూ అనేక కధనాలు వచ్చాయి. ఇవ్వన్నీ అంతర్జాతీయంగా మోదీ ప్రతిష్టను మసకబారుతున్నాయి.
మొదటి ఐదేళ్లు ఆయన మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మంత్రులు ఇప్పుడు లేకపోవడంతోనే ఆయన ప్రతిష్ట ఈ విధంగా మసకబారుతున్నట్లు భావించవలసి వస్తున్నది. వారు సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ. వారిద్దరూ ఇప్పుడు జీవించి కూడా లేరు.
ఏదైనా సమస్య తలెత్తితే విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలలు క్రియాశీలకంగా వ్యవహరించి, భారత్ ప్రతిష్టతను ఇనుమడించే విధంగా చేయడంలో సుష్మా అందరు ప్రశంశలు అందుకున్నారు. ఇప్పుడు స్వయంగా ప్రముఖ దౌత్య అధికారి ఎస్ జైశంకర్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన రాజకీయ చొరవ చూపడంలో సఫలం కాలేక పోతున్నారు.
మరోవంక అరుణ్ జైట్లీకి మీడియా సంస్థలతో మంచి సంబంధాలు ఉంటూ ఉండెడిది. ప్రభుత్వానికి అనుకూలంగా,ప్రతిపక్షాలకు ఇరకాటం కలిగించే విధంగా మీడియాలలో కధనాలు జొప్పించడంలో ఆయన చాలా ఆచాకచక్యంగా వ్యవహరిస్తుండే వారు. ప్రస్తుతం అటువంటి పాత్ర వహించాగలిగే నేత బిజెపిలో ఎవ్వరు లేకపోవడంతో మీడియాలో ప్రధాని మొదటిసారిగా చాలా ప్రతికూలతను ఎదుర్కోవలసి వస్తున్నట్లు భావిస్తున్నారు.
బీజేపీ అధికార ప్రతినిధులు అందరు మీడియాలో ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తి, ఆయన దృష్టిని ఆకట్టుకోవాలని తాపత్రయ పాడేవారే గాని, మోదీ ప్రభుత్వం ఇమేజ్ ను ఇనుమడించే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించ గలిగిన వారే కనబడటం లేదు. అందుకనే ఢిల్లీ అల్లర్ల అనంతరం ప్రధాని మోదీ తన మంత్రివర్గ సహచరులు, బీజేపీ నేతల పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది.
ప్రపంచం అంతగా అలజడి కలిగిస్తున్న కరోనా వైరస్ విషయమై సార్క్ దేశాల మధ్య సయెధ్య కోసం మోదీ చొరవ తీసుకోవడం కేవలం అంతర్జాతీయంగా మసకబారిన ప్రతిష్టను ఇనుమడింప చేసుకోవడమే అని భావించవలసి వస్తున్నది. వాస్తవానికి గత ఐదేళ్లుగా సార్క్ శిఖరాగ్ర సదస్సు జరుగకుండా, దానిని నిర్వీర్యం అయ్యే విధంగా మోదీ చేస్తున్నారు. దక్షిణాసియాలో పాకిస్థాన్ ను ఏకాకి చేయడం కోసం మరో ఉప ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేసి ఆయా దేశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు.
గత ఆగష్టు లో జైట్లీ మృతి చెందినప్పటి నుండి మోదీ ప్రభుత్వం ఒక దాని తర్వాత మరో సంక్షోభములలో చిక్కుకొంటూ వస్తున్నది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో అంతా తానై వ్యవహరిస్తున్న అమిత్ షా సహితం ధన బలం, అధికార బలంలను ఉపయోగిస్తూ రాజకీయ ప్రత్యర్దులలు ఐటి, ఈడీ దాడులతో వేధించడం; ఇతర ప్రతీల నుండి ఫిరాయింపులను ప్రోత్సహించడం, సొంత పార్టీలో మరెవ్వరు మాట్లాడకుండా చేయడం తప్పా వ్యూహాత్మకంగా సంక్షోభాలను సరిదిద్దడంలో జైట్లీకి ఉన్న నైపుణ్యం లేదని వెల్లడి అవుతున్నది.