కృష్ణా జలాల ఒప్పందం ఇప్పుడు తెలంగాణ, ఏపీలను భయపెడుతోంది. కేసీఆర్ చేసిన ప్రకటన ఏపీ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెడుతోంది. దీంతో ఏం మాట్లాడాలో తెలియక సతమతమవుతున్నారు. దీనికి కారణం 2015లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు తీసుకోవడానికి చంద్రబాబు హయాంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తాజాగా ఏర్పడిన వివాదంతో కృష్ణా జలాల ఒప్పందం చెల్లదనే వాదనను తెరపైకి తీసుకొచ్చింది. కృష్ణా జలాల్లో సగం వాటా ఇవ్వాల్సిందేనని వాదిస్తున్నారు.
ఇప్పుడు వైసీపీ డోలాయమానంలో పడిపోయింది. తెలంగాణ అడిగిన వాటా ఇవ్వడానికి వీలు లేకపోవడంతో తికమకపడుతోంది. ఏపీ సర్కారుకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. చంద్రబాబు హయాంలో కుదుర్చుకున్న ఒప్పందం కావడంతో కేసీఆర్ పై ఒత్తిడి చేసేందుకు ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు జల వివాదాన్ని వాడుకుంటున్నాయి.
దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు చంద్రబాబుతో చేసుకున్న ఒప్పందం అబద్ధమైతే శ్రీశైలం డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడం కొసమెరుపు. ఏపీ బీజేపీ నాయకుడు టీజీ వెంకటేశ్ సైతం తన స్వరం వినిపిస్తున్నారు. చంద్రబాబు హయాంలో చేసుకున్న ఒప్పందం అబద్ధమైతే రాష్ర్ట విభజన సైతం చెల్లదని కొత్త కోణంలో స్పందిస్తున్నారు. దీంతో రాజకీయంగా జలాల వివాదం పెద్ద దుమారం రేపుతోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నదీ జలాల వివాదంతో కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మాకంటే మాకే చెందాలని పదేపదే చెబుతుండడంతో ప్రజలు కూడా సతమతమవుతున్నారు. కృష్ణానదీ జలాల వినియోగంలో రెండు ప్రాంతాల నాయకులు పరస్పరం లేనిపోని ఆరోఫణలు చేసుకుంటున్నారు. తెలంగాణ మంత్రులుసైతం ఏపీ నాయకులపై చెలరేగిపోతున్నారు. దీంతో వారికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అన్నిటికి కాలమే సమాధానం చెబుతుందనే ధోరణితో వేచి చూసే పద్దతిలో ఏపీ నేతలుసంయమనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది.
అప్పుడు 2015లో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలనే నిబంధన ఉన్నా అది మాకు సంబంధం లేదని చెప్పడం గమనార్హం. దీంతో వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇందులో నాయకులు సైతం తల దూర్చి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వాపోతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సైతం పెదవి విప్పడం లేదు. ఈనేపథ్యంలో ఈ సమస్యకు ఎక్కడ పరిష్కారం దొరుకుతుందోనని ఎదురు చూస్తున్నారు.