CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా సంచలనమే. ఆయనకు పేరు వచ్చేలా చూసుకుంటారు. దీంతో పథకాలకంటే ప్రచారానికే విలువ ఇస్తారు. మీట నొక్కేందుకు కూడా ఆయన ప్రచారాన్నే ఆయుధంగా చేసుకుంటారు. ప్రజల్లో పలుకుబడి పెరిగేందుకు దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయం. ఈ మేరకు రాష్ట్రంలో ఏ చిన్న పని చేసినా దాని వెనుక పెద్ద ప్రచారమే దాగి ఉంటుంది. అయితే ఇటీవల జగన్ ప్రభుత్వం రాష్ర్టంలో చేపల విక్రయాల వ్యాపారం కూడా చేపట్టింది. దీంతో చేపలు అమ్మే వారికి వాహనాలు సైతం సమకూర్చింది.

దీంతో విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. గంగపుత్రులు తమ ఉపాధికి గండి కొడుతున్నారని వాదించినా ప్రయోజనం లేదు. చేపల బండ్లు వచ్చేశాయి. దీంతో వ్యాపారం షురూ అయింది కానీ ప్రచారం మాత్రం కాలేదు. దీంతో అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రభుత్వం వాహనాలను వట్టిగా రోడ్డు మీదికి రానిస్తే ఆయన పరువు ఏమవుతుందని నోళ్లు గొనుక్కుంటున్నారు. దీంతో వాటిని జెండా ఊపి ప్రారంభించి అయినా తన ప్రతిష్ట పెంచుకోవాలని ఎందుకు చూడటం లేదనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
ప్రభుత్వం అందించిన వాహనాల్లో సబ్సిడీపై చేపల విక్రయానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అన్ని ప్రాంతాల్లో వాహనాలు వెళ్లాయి. వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే జెండా ఊపి ప్రారంభించనందుకే అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు గతంలో కూడా చెత్త వాహనాలు, రేషన్ బియ్యం అందించే వాహనాలు, అంబులెన్స్ లు అన్నింటిని ఇలాగే ప్రారంభించి ప్రచారం నిర్వహించారు. కానీ వీటికి ఎందుకు ప్రచారం చేసుకోలేదనే సంశయాలు వస్తున్నాయి. కానీ జగన్ ఏం చేసినా దానికో పరమార్థం మాత్రం కచ్చితంగా ఉంటుందనే అభిప్రాయాలు వస్తున్నాయి.

దీనిపై రాష్ర్టంలో పెద్ద చర్చ జరుగుతోంది. చేపల విక్రయాల వల్ల ఎవరికి లాభం? ఎందుకీ వ్యాపారం చేపట్టినట్లు అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం కూడా ఏం చెప్పడం లేదు. ప్రజా సంక్షేమమే మా లక్ష్యం అంటూ చెబుతుంది తప్ప అదేంటో వివరించడం లేదు. దీంతో చేపల విక్రయంతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుందా? ఒక వేళ వస్తే దాన్ని ఏం చేస్తారు? అనే వాటిపై కచ్చితమైన సమాధానాలు మాత్రం రావడం లేదు. దీంతో జగన్ మదిలో ఏముందో ఏం చేస్తున్నారో అని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.