https://oktelugu.com/

CM Jagan: ఉద్యోగుల సమ్మెను లెక్కచేయని జగన్.. ఇంకా బెదిరింపు ధోరణే..

CM Jagan: ఏపీ సర్కారు, ఉద్యోగుల మధ్య పీఆర్సీ ఫైట్.. ఇంకా ముదురుతున్నది. ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ సక్సెస్ కాగా, ప్రభుత్వం మాత్రం ఆ విషయమై పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయమై సీరియస్ అయ్యారని సమాచారం. ఉద్యోగులు ఉద్యమం సక్సెస్ అయిందని భావిస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని పెద్దగా అయితే పట్టించుకున్నట్లు కనబడటం లేదు. ఉద్యోగుల ఇలా ఉప్పెనలా ఉద్యమం చేశామని అనుకుంటున్న […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 4, 2022 / 11:46 AM IST
    Follow us on

    CM Jagan: ఏపీ సర్కారు, ఉద్యోగుల మధ్య పీఆర్సీ ఫైట్.. ఇంకా ముదురుతున్నది. ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ సక్సెస్ కాగా, ప్రభుత్వం మాత్రం ఆ విషయమై పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయమై సీరియస్ అయ్యారని సమాచారం. ఉద్యోగులు ఉద్యమం సక్సెస్ అయిందని భావిస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని పెద్దగా అయితే పట్టించుకున్నట్లు కనబడటం లేదు.

    CM Jagan

    ఉద్యోగుల ఇలా ఉప్పెనలా ఉద్యమం చేశామని అనుకుంటున్న సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దగా దీనిపి పట్టించుకోలేదని టాక్. ఇక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ వంటి వారు ఒకరి తర్వాత ఒకరు మీడియాతో మాట్లాడారు. చర్చలకు రావాలని తాము ప్రతీ రోజు పిలుస్తున్నామని అంటున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగులకు చాలా చేశామని, అయినప్పటికీ వారు ఆ విషయాలను గుర్తించడం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు.

    Also Read: Ap Employees vs Jagan: ఉద్యోగులతో వైరం.. జగన్ కు మంచికా? చెడుకా?

    ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు సమ్మెకు వెళ్లి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అలా బెదిరింపు ధోరణిలో మాట్లాడటం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులే కావాలని అతి చేస్తున్నారన్నట్లు వారి మాటలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వ వాదన ఉంది. కాగా, ప్రభుత్వ వాదనను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు తప్పుబడుతున్నారు. తమకు వేతనం తగ్గిందని క్లియర్ కట్ గా చెప్తుంటే., ఎక్కడ తగ్గిందో చెప్పాలని సరికాదంటున్నారు. ఇందుకు సంబంధించిన శాలరీ పే స్లిప్‌లను ప్రదర్శించారు.

    మొత్తంగా ఉద్యోగులు తాము మరింతగా ఉద్యమంలో ముందుకెళ్తామని హెచ్చరిస్తున్న క్రమంలో ప్రభుత్వం మాత్రం అస్సలు కనీస మాత్రంగానైనా స్పందించడం లేదు. మరో వైపున ఉద్యోగుల పక్షాన పోరాడేందుకుగాను విపక్షాలు రెడీ అంటున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ వారికి సంపూర్ణ మద్దతు తెలిపారు. వారికి అవసరమైనపుడు ఉద్యమంలో పాల్గొంటామని చెప్పారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం ఉద్యోగుల ఉద్యమం సరైనదేనని అభిప్రాయపడ్డారు. చూడాలి మరి.. ఈ ఉద్యోగుల ఉద్యమం ఎక్కడి వరకు వెళ్తుందో.. ఏపీ సర్కారు వారి ఉద్యమాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తుందా? లేదా వారి డిమాండ్లను నెరవేరస్తుందా? అనేది తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

    Also Read: AP CM Jagan: విద్యావ్య‌వ‌స్థ‌లో స‌మూల మార్పుల‌కు జ‌గ‌న్ శ్రీకారం చుట్ట‌నున్నారా?

    Tags