రఘురామ vs జగన్: బెయిల్ రద్దుపై సీబీఐ షాకింగ్ కౌంటర్

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టుకు ఎక్కారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. దీనిపై విచారణకు స్వీకరించిన కోర్టు ఇప్పటికే జగన్ సహా పలువురికి నోటీసులు ఇచ్చారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటీషన్ పై న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. తాజాగా ఈ కేసులో ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. తాను బెయిల్ షరతులు ఉల్లంఘించలేదని […]

Written By: NARESH, Updated On : June 1, 2021 1:27 pm
Follow us on

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టుకు ఎక్కారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. దీనిపై విచారణకు స్వీకరించిన కోర్టు ఇప్పటికే జగన్ సహా పలువురికి నోటీసులు ఇచ్చారు.

జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటీషన్ పై న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. తాజాగా ఈ కేసులో ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. తాను బెయిల్ షరతులు ఉల్లంఘించలేదని జగన్ పిటీషన్ లో పేర్కొన్నారు.

రఘురామ పిటీషన్ కు విచారణ అర్హత లేదని.. వ్యక్తిగత రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఆయన పిటీషన్ ను కొట్టివేయాలని సీబీఐ కోర్టును జగన్ కోరారు.

ఇక సీబీఐ కూడా కోర్టులో మెమో దాఖలు చేసింది. రఘురామ పిటీషన్ పై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని.. ఈ విషయంలో కోర్టుదే తుది నిర్ణయం అని తెలిపింది. దీంతో సీబీఐకోర్టు ఈనెల 14కు విచారణను వాయిదా వేసింది.

జగన్ బెయిల్ రద్దు విషయంలో కేంద్రం నేతృత్వంలోని సీబీఐ కౌంటర్ కీలకంగా ఉంటుంది. దీన్ని బట్టే కేంద్రం జగన్ కు సపోర్టునా? లేక రఘురామకు సపోర్టుగా వ్యవహరిస్తుందా అనేది తేలేది. దీంతో సీబీఐ అఫిడవిట్ ఏం దాఖలు చేస్తుందా? అని అందరూ ఎదురుచూసుకుంది.

సీబీఐ ఈ విషయంలో కర్ర విరగకుండా పాము చావకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ బెయిల్ అంశాన్ని సీబీఐ తన మీదకు రాకుండా కోర్టుకే నిర్ణయాధికారాన్ని వదిలేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇటు జగన్ కు సపోర్టు చేయకుండా.. అటు రఘురామ వంత పాడకుండా తప్పించుకున్న వైనం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సీబీఐని, కేంద్రాన్ని జగన్ విషయంలో టార్గెట్ చేయాలనుకునే వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా సీబీఐ కౌంటర్ దాఖలు చేసిందన్న చర్చ సాగుతోంది.