జగన్ కేసు : సీబీఐ మతలబేంటి..?

అక్రమాస్తుల కేసులో  ఉన్న జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణ మరో పిటిషన్ ను సీబీఐ కోర్టులో దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే జగన్, సీబీఐ కౌంటర్ ఇవ్వగా.. తాజాగా దీనికి కొనసాగింపుగా రఘురామ మరో పిటీషన్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ తటస్థ వైఖరిని తెలిపినట్లు అర్థమవుతుంది. బెయిల్ రద్దు విషయంలో అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని సీబీఐ తెలిపింది. దీంతో జగన్ బెయిల్ రద్దుపై ఎటువంటి […]

Written By: NARESH, Updated On : June 3, 2021 8:54 pm
Follow us on

అక్రమాస్తుల కేసులో  ఉన్న జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణ మరో పిటిషన్ ను సీబీఐ కోర్టులో దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే జగన్, సీబీఐ కౌంటర్ ఇవ్వగా.. తాజాగా దీనికి కొనసాగింపుగా రఘురామ మరో పిటీషన్ దాఖలు చేశారు.

జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ తటస్థ వైఖరిని తెలిపినట్లు అర్థమవుతుంది. బెయిల్ రద్దు విషయంలో అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని సీబీఐ తెలిపింది. దీంతో జగన్ బెయిల్ రద్దుపై ఎటువంటి క్లారిటీ ఇవ్వనట్లు తెలుస్తోంది. అయితే కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం జగన్ సీఎం స్థాయిలో ఉన్నందున సీబీఐ అలాగే ప్రవర్తిస్తుందని అంటున్నారు. ఇలాంటి విషయాల్లో జగన్ మాత్రమే కాకుండా గతంలోనూ చాలా మంది నేతలు సీబీఐని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారని అంటున్నారు.

అధికారంలోకి రాకముందు సీబీఐ జగన్ పై అక్రమాస్తుల కేసుల విషయంలో ప్రతి రోజు విచారణ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిని సీబీఐ అధికారులు తమదైన శైలిలో విచారిస్తూ తగినంత సమాచారాన్ని సేకరించారు. ఆ తరువాత జగన్ జైలుకు వెళ్లేలా చేశారు. ఎలాగోలా బెయిల్ తెచ్చుకున్న జగన్ మొత్తానికి ప్రజల మద్దతుతో 2019లో అధికారంలోకి వచ్చారు. సీఎం పీటంపై కూర్చున్నారు. అయితే ఇప్పటి వరకు జగన్ కేసు విషయంలో ఎవరూ తలదూర్చలేదు. సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేయడంతో మళ్లీ ఆయన బెయిల్ పై చర్చ మొదలైంది.

అయితే సీబీఐ ప్రత్యక్ష రంగంలోకి దిగకుండా అవసరమైన చర్యలు తీసుకోండంటూ చెప్పడం ఆసక్తిగా మారింది. గతంలో జగన్ కేసు విషయంలో నిక్కచ్చిగా ఉన్న సీబీఐ ప్రస్తుతం అవసరమైన చర్యలు తీసుకోవాలనడం అధికార భయమేనా..? అని కొందరు అంటున్నారు. ఏ రాజకీయ నేత అయిన అధికారంలో ఉంటే సంబంధిత కేసు సాక్షులను ప్రభావితం చేయనున్నందున…ఈ కేసు ఎలాగు ముందుకు సాగదని కొందరు అనుకుంటున్నారు.

అయితే ఎంపీ రఘురామ పిటిషన్ ఇచ్చిన తరువాత ఆయన ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడో అందరికీ తెలిసిందే. అందువల్ల సాక్షులు కూడా అలాంటి భయాందోళనకు గురయ్యే ప్రమాదముందని గ్రహించిన సీబీఐ ముందుగానే తన చేతికి మట్టి అంటకుండా వ్యవహరిస్తుందని అంటున్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, ఎలుగుబంటి కేసులు ఇలాగే ఏళ్ల తరబడి నానుతూ అవి కోర్టు ఫైళ్లలోనే ఉంటున్నాయి. దీంతో ఇప్పుడు కూడా సీబీఐ అలా అనడంతో ఈ కేసు ఎన్నేళ్లు పడుతుందోనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.