బాబు బినామీకి జగన్ బంపర్ ఆఫర్..!

రాష్ట్రంలో వైసీపీ నేతల కంటే టీడీపీ వారికే అగ్రతాంబూలం అని వైసీపీ ప్రభుత్వం మరోసారి నిరూపించింది.రాష్ట్రంలో ప్రస్తుతం ఒక విషయంపై విపరీంగా చర్చ జరుగుతుంది… అదేంటంటే టీడీపీ నాయకుడిగా ఉన్న ఒక వ్యక్తికి వెయ్యి ఎకరాల మైనింగ్ లీజులు కేటాయించడం. టీడీపీ హయాంలో శేఖర్ రెడ్డి టిటిడి బోర్డు సభ్యుడిగా ఉన్నారు. మరోవైపు చంద్రబాబు బినామీ అని వైసీపీ చెప్పుకొచ్చింది. ఇప్పడు శేఖర్ రెడ్డికి చెందిన సంస్థకు నెల్లూరు జిల్లాలోని మైకా లీజులు కట్టబెట్టడం కలకలం రేపుతోంది. […]

Written By: Neelambaram, Updated On : August 26, 2020 11:48 am
Follow us on


రాష్ట్రంలో వైసీపీ నేతల కంటే టీడీపీ వారికే అగ్రతాంబూలం అని వైసీపీ ప్రభుత్వం మరోసారి నిరూపించింది.రాష్ట్రంలో ప్రస్తుతం ఒక విషయంపై విపరీంగా చర్చ జరుగుతుంది… అదేంటంటే టీడీపీ నాయకుడిగా ఉన్న ఒక వ్యక్తికి వెయ్యి ఎకరాల మైనింగ్ లీజులు కేటాయించడం. టీడీపీ హయాంలో శేఖర్ రెడ్డి టిటిడి బోర్డు సభ్యుడిగా ఉన్నారు. మరోవైపు చంద్రబాబు బినామీ అని వైసీపీ చెప్పుకొచ్చింది. ఇప్పడు శేఖర్ రెడ్డికి చెందిన సంస్థకు నెల్లూరు జిల్లాలోని మైకా లీజులు కట్టబెట్టడం కలకలం రేపుతోంది.

Also Read: వలసవాదులతో వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి..!

2016లో శేఖర్ రెడ్డి టిటిడి బోర్డు సభ్యుడిగా ఉండగా పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ.107 కోట్లు నగదు ఐటి విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో విషయం ఏమిటంటే బ్యాంకుల వద్ద తక్కువగా ఉన్న రూ.2 వేల కొత్త నోట్లు శేఖర్ రెడ్డి ఇంట్లో కట్టలు కట్టలుగా లభ్యం అయ్యాయి. అదేవిధంగా 127 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో శేఖర్ రెడ్డిపై వైసీపీ నాయకులు చేయని విమర్శలు లేవు. నారా లోకేష్ కు డబ్బులు ఇచ్చి టీటీడీ బోర్డు సభ్యునిగా పదవి పొందారని వైసీపీ విమర్శించింది.

ఇప్పుడు ఉన్నట్లుండి నెల్లూరు జిల్లాలోని మైకా గనుల లీజులకు సంబంధించి నిబంధనలు మార్చి 80 చిన్న సంస్థలు గనుల తవ్వుకొంటుండగా వాటి లీజులను రద్దు చేసి కొత్త నిబంధనలుతో శేఖర్ రెడ్డికి చెందిన అవంతిక సంస్థకు మొత్తం వెయ్యి ఎకరాల గనులు లీజుకు ఇవ్వడం ఆ పార్టీ నేతులు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు బినామీ అన్న పార్టీ నేతలు ఇప్పుడు ఉన్నట్లుంది నిబంధనలు సవరించి మరీ శేఖర్ రెడ్డి సంస్థకు గనులు కట్టబెట్టడానికి కారణాలేంటనే విషయాన్ని అన్వేషిస్తున్నారు.

Also Read: రామచంద్రమూర్తి రాజీనామాకు కారణమిదేనా?

మైకా ఘనుల లీజు వ్యవహారం వెనుక పెద్ద లాబీయింగ్ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. టీడీపీ నాయకులను వివిధ రకాల కేసులు మోపుతున్న ప్రభుత్వం శేఖర్ రెడ్డి వ్యవహారంలో అవలంభిస్తున్న విధానం ఇందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వ పెద్దల హస్తం, లాబీయింగ్ లేకుండా ఈ తంతు చోటు చేసుకునే అవకాశం లేదని వైసీపీ నేతలే అంటున్నారు.