పవన్ ను సైడ్ చేయడమే జగన్, బాబు లక్ష్యమా?

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఏపీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైసీపీ, టీడీపీ తర్వాత ఏపీలో జనసేనకే అత్యధిక ఫాలోవర్స్ ఉన్నారు. కిందటి ఎన్నికల్లో జనసేనకు ఒక్క సీటే వచ్చింది. అయినప్పటికీ పవన్ కల్యాణ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. పవన్ నేరుగా రంగంలోకి దిగితే ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి తప్ప అప్పటివరకు మొద్దు నిద్రపోతున్నాయనే టాక్ ప్రజల్లో వ్యక్తమవుతోంది. Also Read: జగన్ స్కెచ్.. […]

Written By: NARESH, Updated On : September 12, 2020 5:20 pm
Follow us on

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఏపీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైసీపీ, టీడీపీ తర్వాత ఏపీలో జనసేనకే అత్యధిక ఫాలోవర్స్ ఉన్నారు. కిందటి ఎన్నికల్లో జనసేనకు ఒక్క సీటే వచ్చింది. అయినప్పటికీ పవన్ కల్యాణ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. పవన్ నేరుగా రంగంలోకి దిగితే ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి తప్ప అప్పటివరకు మొద్దు నిద్రపోతున్నాయనే టాక్ ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Also Read: జగన్ స్కెచ్.. చంద్రబాబుకు గట్టిగానే తగలనుందా?

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ప్రజా సమస్యలపై పోరాడాల్సి ఉంది. అయితే జగన్ సర్కార్ టీడీపీ నేతలను టార్గెట్ చేస్తుండటంతో వారంతా ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటే జంకుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు వయస్సు భారం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. క్షేత్రస్థాయి పర్యటనలు దూరంగా ఉంటూ జూమ్లో టీడీపీ శ్రేణులకు సందేశాలిస్తున్నారు. ప్రెస్ మీట్లతో ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప ఇటీవలీ కాలంలో టీడీపీ పెద్దగా ప్రజా సమస్యలపై పోరాడిందేమీలేదని వాదనలు విన్పిస్తున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా సమస్యలపై గొంతెత్తిన సీఎం జగన్ ఏమాత్రం ఆయన పట్టించుకున్నా పాపాన పోలేదు. టీడీపీ నేతల డిమాండ్లను ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. దీంతో టీడీపీ నేతలు కూడా ఇటీవలీ కాలంలో ప్రజా సమస్యలపై సైలంట్ అవుతున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై పిలుపునిస్తే మాత్రం జగన్ సర్కార్ వెంటనే స్పందిస్తోంది. త్వరితగతిన ఆ సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడుతోంది.

గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం పవన్ విషయంలో ఇలాంటి వైఖరినే అవలంభించారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్ ప్రజా సమస్యలపై స్పందిస్తే ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక పవన్ సమస్యలపై స్పందిస్తే మాత్రం వెంటనే పరిష్కరించేవారు. పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళితే ఆయన క్రెడిట్ దక్కి ఆ పార్టీ బలపడుతుందని ఆందోళన చెందేవాడు. అందుకే వెంటనే ఆ సమస్యను పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించేవారు. ప్రస్తుతం సీఎం జగన్ సైతం పవన్ ను బాబు లాగానే డీల్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విమర్శలు చేసినా.. ప్రజా సమస్యలపై స్పందించిన వెంటనే క్లియర్ చేస్తున్నారు.

Also Read: ఆ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం మొదలెట్టిన బాబు?

ఇటీవల ఏపీలో జరిగిన అంతర్వేది రథం దగ్ధం ఘటనలో టీడీపీ సీబీఐ ఎంక్వైరీ వేయాలని ఎంత మొత్తుకున్నా జగన్ సర్కార్ పెడచెవిన పెట్టింది. ఈ విషయంలో పవన్ ఎంట్రీ ఇచ్చి ‘ఛలో అంతర్వేది’కి పిలుపునిచ్చారు. దీంతో జగన్ సర్కార్ ఈ విషయంలో సీబీఐ ఎంక్వైరీకి అనుమతి ఇచ్చేలా ఆదేశాలిచ్చింది. పవన్ కల్యాణ్ ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళితే తప్ప పరిష్కరానికి నోచుకోవడం లేదని ఏపీలో విన్పిస్తోంది. పవర్ స్టార్ స్టామీనాను గుర్తించే జగన్ ప్రభుత్వంపై విమర్శలు రాకుండా ముందస్తు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.