జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ.. మళ్లీ ట్విస్ట్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికిచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ ఇచ్చిన పిటిషన్ పై సీబీఐ వాయిదా కోరింది. అటు జగన్ తరుపున న్యాయవాది కూడా వాయిదా కోరడంతో సీబీఐ కోర్టు చాలా సీరియస్ అయింది. ఇలా వాయిదాలు కోరడం కరెక్ట్ కాదని, ఇదే లాస్ట్ చాన్సని గత వాయిదా సమయంలో కోర్టు పేర్కొంది. అయినా జగన్ తరుపున న్యాయవాదులు పట్టించుకోకపోగా తాజాగా మళ్లీ వాయిదా కోరడంతో రఘురామ తరుపున న్యాయవాదులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. […]

Written By: NARESH, Updated On : May 26, 2021 2:56 pm
Follow us on

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికిచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ ఇచ్చిన పిటిషన్ పై సీబీఐ వాయిదా కోరింది. అటు జగన్ తరుపున న్యాయవాది కూడా వాయిదా కోరడంతో సీబీఐ కోర్టు చాలా సీరియస్ అయింది. ఇలా వాయిదాలు కోరడం కరెక్ట్ కాదని, ఇదే లాస్ట్ చాన్సని గత వాయిదా సమయంలో కోర్టు పేర్కొంది. అయినా జగన్ తరుపున న్యాయవాదులు పట్టించుకోకపోగా తాజాగా మళ్లీ వాయిదా కోరడంతో రఘురామ తరుపున న్యాయవాదులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కారణంగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయలేకపోతున్నామని అందుకే వాయిదా వేయాలని జగన్ తరుపున న్యాయవాదులు చెప్పొకొచ్చారు. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి కోర్టుకు రానక్కర్లేదని, మెయిల్ కూడా పెట్టొచ్చని సీబీఐ కోర్టు తెలిపింది. అయితే కోర్టు ఈ విధంగా తెలిపినా జగన్ తరుపున న్యాయవాదుల నుంచి స్పందన లేదు. సీబీఐ కూడా పదే పదే వాయిదాలు కోరడంతో ఎంపీ తరుపున న్యాయవాదులు ఇలా వాయిదాలు ఎందుకు కోరుతున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు.

ఇదిలా ఉండగా సీబీఐ జేడీగా జైస్వాల్ నియమితులయ్యారు. ఈయన ఆర్థిక నేరస్తుల పట్ల చాలా కఠినంగా ఉంటారని పేరుంది. గతంలో తెల్గీని జైలు పాలు చేసింది ఈయనే. ఇప్పుడు సీబీఐ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడంతో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో జగన్ బెయిల్ సీబీఐ పిటిషన్ మీదే ఆధారపడి ఉంది. ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘించారని తేలితే మాత్రం కేసు మలుపు తిరిగే అవకాశం ఉందని అంటున్నారు.