Homeఆంధ్రప్రదేశ్‌MLA Roja: మాట నెగ్గించుకున్న ఎమ్మెల్యే రోజా

MLA Roja: మాట నెగ్గించుకున్న ఎమ్మెల్యే రోజా

mla roja: వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగిన రోజా అంటే జగన్ కు ప్రత్యేక అభిమానమే. ఆమెకు మంత్రి పదవి విషయంలో అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి ప్రతి సారి ఊరిస్తూనే ఉంది. అక్కడ ఉన్న సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి దరి చేరడం లేదు. కానీ ఆమె అనుకున్న పనులు మాత్రం నెరవేర్చడంలో జగన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చేసేస్తారు. ఇందులో భాగంగానే ఆమె ఇటీవల తన డిమాండ్లు చెప్పగా సానుకూలంగా స్పందించి ఆమె చెప్పిన పనులు చేసి పెట్టారు.

MLA Roja
MLA Roja

దీంతో జగన్ పై రోజా ప్రశంసల జల్లు కురిపించారు. జగనన్న అండగా ఉండగా తమకు లోటు లేదని ప్రకటించారు. నగరి లో రోజాకున్న ఇమేజ్ ను ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా జగన్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటారు. దీంతో నగరిని రెవెన్యూ డివిజన్ చేయాలని రోజా కోరడంతో తక్షణమే అమలు చేశారు. చంద్రబాబు ఇన్నేళ్ల పాలనలో చేయలేనిది జగన్ మూడేళ్లలోనే చేశారని చెప్పుకొచ్చారు

Also Read: KCR vs Modi: ఢిల్లీ వేదికగా కేసీఆర్ పోరాటం ఫలిస్తుందా?

పుత్తూరు, వడమాల పేట మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని కోరారు. జాతీయ రహదారి పక్కనే ఉండటంతో వాటిని చిత్తూరులో కలపొద్దని రోజా సూచించారు. దీనికి కూడా జగన్ సానకూలంగానే స్పందించారు. వాటిని తిరుపతిలోనే కలిపి రోజాకు మద్దతుగా నిలిచారు.దీంతో రోజా ఆనందం వ్యక్తం చేశారు. జగనన్న ఉండగా తమకు ఇబ్బందులేవి ఉండవని ఉద్వేగంతో చెప్పారు. దీంతో రోజా ప్రజల కోరిక నెరవేర్చగలిగారు.

MLA Roja
MLA Roja

జగన్ ఆడపడుచులకు అన్యాయం చేయరని ఆకాశానికెత్తారు. తమ అభిరుచులను గుర్తించి ఏం కావాలో అడిగితే చాలు క్షణాల్లో చేసే జగనన్న అని తనదైన శైలిలో ప్రశంసించారు. జగన్ తొందరగా స్పందించి మా ప్రాంత వాసుల కోరికలు తీర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. జగన్ పాలనపై రోజా ఆయనకు ఇక తిరుగులేదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగనే ముఖ్యమంత్రి అని కొనియాడుతున్నారు.

Also Read:Chiranjeevi Anasuya : అనసూయతో చిరంజీవి.. ఈ రోమాన్స్ తో దొరికిపోయాడు!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

2 COMMENTS

  1. […] JD Laxminarayana: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారుతున్నాయి. పార్టీలు తమ వ్యూహాలు మారుస్తున్నాయి. అధికారం కోసం వైసీపీ పోరాటం చేస్తూనే ఉంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీలు కూడా తమ ప్రభావం చూపించి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నాయి. గతంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ జనసేనలో చేరి పోటీ చేసి ఓటమి పాలవడంతో పార్టీకి రాజీనామా చేసి స్వచ్చంధంగా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. తనదైన శైలిలో సమస్యలపై స్పందిస్తున్నారు. ఇప్పటికైతే ఏ పార్టీలో చేరకపోయినా ఏదో ఒక పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. […]

  2. […] Nara Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం క్టిష్ట పరిస్థితుల్లో ఉంది. గతంలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2024 ఎన్నికలు చావో రేవో అన్నట్టు ఫైట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని భావిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. చంద్రబాబు వయసు పైబడుతోంది. కుమారుడు లోకేష్ ఉన్నా ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. దీంతో చంద్రబాబుకు చేయి అందించే వారే లేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పాత రాజకీయ చతురతను చంద్రబాబు పదును పెడుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీని ఏకతాటిపైకి తీసుకు రావడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలని భావిస్తున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular