https://oktelugu.com/

Varudu Kavalenu: వైభవంగా వరుడు కావలెను సంగీత్ ఈవెంట్… చీఫ్ గెస్ట్ గా పూజ హెగ్డే

Varudu Kavalenu: యంగ్ హీరో నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సినిమా ” వరుడు కావలెను “. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై… సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  తాజాగా ఈ సినిమాకు సంబందించిన సంగీత్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బుట్టబొమ్మ పూజ హెగ్డే ముఖ్య అతిథిగా హాజరు అయ్యింది. మామూలుగా ఫిల్మ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 23, 2021 / 10:05 PM IST
    Follow us on

    Varudu Kavalenu: యంగ్ హీరో నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సినిమా ” వరుడు కావలెను “. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై… సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  తాజాగా ఈ సినిమాకు సంబందించిన సంగీత్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బుట్టబొమ్మ పూజ హెగ్డే ముఖ్య అతిథిగా హాజరు అయ్యింది.

    మామూలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాకు కొబ్బరికాయ కొట్టే దగ్గరి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు మేల్ సెలెబ్రిటీలనే గెస్ట్ లుగా పిలుస్తుంటారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు  గెస్ట్ గా ఫిమేల్ ఆర్టిస్ట్ గెస్ట్ గా రావడం గమనార్హం.  దీంతో పూజా హెగ్డే రేంజ్ ఏ స్థాయికి వెళ్ళిందో అర్దం చేసుకోవచ్చు.

    ప్రస్తుతం వరుస హిట్స్, క్రేజీ ప్రాజెక్ట్స్ తో పూజా కెరీర్ ఫుల్ పీక్స్ లో ఉంది. అందుకే ఓ వైపు తన మూవీ ఈవెంట్స్ లో పాల్గొంటూనే…  తానే గెస్ట్ గా మారి వేరే సినిమాలో ఫంక్షన్స్ లో గ్లామర్ షో చేస్తోంది. వరుడు కావలెను  సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు ఈ చిత్రాన్ని అక్టోబర్ 29న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రానా విడుదల చేశారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన లభిస్తుంది.