https://oktelugu.com/

ఈటల ఎఫెక్ట్:కేబినెట్ ప్రక్షాళనకు కేసీఆర్ రె‘ఢీ’!

ఏదీ ఊరికే చేయరు మహానుభావులు అన్నట్టు కేసీఆర్ చేసే ప్రతి చర్య వెనుక ఏదో అర్థం పరమార్థం ఉంటుందని అంటారు. ఒక ఉరుము ఉరిమినట్టు.. పిడిగు పడినట్టు కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. మీడియాకు, సన్నిహితులకు కూడా తెలియకుండా చక్రం తిప్పుతుంటారు కేసీఆర్. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంత్రివర్గం నుంచి సీనియర్ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు ఈటాల రాజేందర్ ను తొలగించడం సంచలనమైన సంగతి తెలిసిందే. అయితే ఈటలను తొలగించడం వెనుక పెద్ద కథ ఉందని.. […]

Written By: , Updated On : May 5, 2021 / 04:49 PM IST
Follow us on

KCR

ఏదీ ఊరికే చేయరు మహానుభావులు అన్నట్టు కేసీఆర్ చేసే ప్రతి చర్య వెనుక ఏదో అర్థం పరమార్థం ఉంటుందని అంటారు. ఒక ఉరుము ఉరిమినట్టు.. పిడిగు పడినట్టు కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. మీడియాకు, సన్నిహితులకు కూడా తెలియకుండా చక్రం తిప్పుతుంటారు కేసీఆర్.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంత్రివర్గం నుంచి సీనియర్ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు ఈటాల రాజేందర్ ను తొలగించడం సంచలనమైన సంగతి తెలిసిందే. అయితే ఈటలను తొలగించడం వెనుక పెద్ద కథ ఉందని.. మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడంలో భాగంగానే ధిక్కార స్వరం వినిపించిన ఈటలను తొలగించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు పనిలో పనిగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

మంగళవారం కరోనాను జయించిన సీఎం కేసీఆర్ ఇక పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టనున్నారు. ముఖ్యమంత్రి ఇక పార్టీపై.. ప్రభుత్వంపై ఫోకస్ పెడుతారని.. ఒకటి లేదా రెండు రోజుల్లో అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

ఈటాల రాజేందర్ స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు సరిగా పనిచేయని.. వ్యతిరేకత ఉన్న మంత్రులను సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించబోతున్నారని.. త్వరలోనే తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని తెలుస్తోంది.

“ఈటలను తొలగించడంపై ఇప్పటికే పార్టీలో అసంతృప్తి చెలరేగుతోంది. ఈ దశలో కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రక్షాళన చేయకపోవచ్చు. ఈ దశలో ఏ మంత్రిని అయినా తొలగించకపోవచ్చు అని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే సి లక్ష్మారెడ్డిని కేసిఆర్ కేబినెట్‌లోకి తీసుకొని ఆయనకు వైద్య, ఆరోగ్య శాఖను అప్పగించవచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

లక్ష్మరెడ్డి 2014 నుంచి 2018 మధ్య కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నారు. ఆరోగ్య శాఖను నిర్వహించారు, తొలగించిన మరొక మంత్రి తాడికొండ రాజయ్య నుంచి బాధ్యతలు స్వీకరించారు.

అయితే కేసీఆర్ తన కుమార్తె కల్వకుంట్ల కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. అయితే తన కుమార్తెకు మంత్రి పదవి ఇవ్వడానికే ఈటలను బలిపశువుగా చేశారనే విమర్శలకు ఇది దారి తీస్తుంది. ఈ దశలో కేసీఆర్ అలాంటి చర్చను తావివ్వకూడదని.. అందుకే కవితను మంత్రివర్గంలోకి తీసుకోకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. కానీ ఆ సాహసం చేస్తారా? లేదా అన్నదే ఇక్కడ డౌటు. వివిధ వర్గాల నుంచి మరింత విమర్శలకు దారి తీస్తుందని కేసీఆర్ కు తెలుసు. అందుకే దీనిపై మిన్నకుండిపోతారని అంటున్నారు. కానీ కేబినెట్ విస్తరణ మాత్రం ఉంటుందని అంటున్నారు.
YouTube video player