TDP- BJP: ఏపీలో పొత్తుల లెక్కలు ఇంకా తేలడం లేదు. టిడిపి, జనసేన,బిజెపి కలుస్తాయి అనుకున్నా ఇంతవరకు క్లారిటీ రావడం లేదు. గతంలో బిజెపితో స్నేహం విషయంలో టిడిపిలో ఆత్రం కనిపించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టిడిపి నుంచి ఎటువంటి స్పందన లేదు.అయితే బిజెపి వైపు నుంచి సానుకూలత వచ్చేవరకు వెయిట్ చేసేందుకు చంద్రబాబు చూస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తు తేలకపోయినా కీలక అంశంలో బిజెపికి టిడిపి సాయం ప్రకటించింది. సో పొత్తుకు ఇంకా అవకాశం ఉన్నట్లు తేలుతోంది. అదే సమయంలో జాతీయస్థాయిలో విపక్ష కూటమి సైతం ఏ విషయంలోనూ చంద్రబాబును సంప్రదించడం లేదు.
ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో టిడిపి బిజెపి సైడే నిలవనున్నట్లు తెలుస్తోంది. టిడిపికి పార్లమెంట్లో బలం అత్యల్పం. ఢిల్లీలో ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకొస్తున్న బిల్లును వ్యతిరేకించాలని ఆఫ్ చీఫ్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలను కోరారు.కానీ చంద్రబాబును కలవలేదు.వ్యతిరేకించాలని కోరలేదు.పక్కన ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. బిల్లును వ్యతిరేకించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కెసిఆర్ సానుకూలంగా స్పందించారు. కానీ ఏపీ సీఎం జగన్ను మాత్రం కేజ్రివాల్ కలవలేదు.
అటు బిజెపి నుంచి చంద్రబాబుకు విజ్ఞప్తి వచ్చినట్లు తెలుస్తోంది. ఆప్ సంప్రదించకపోవడం, బిజెపి సాయాన్ని కోరడంతో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ విషయంలో బిజెపి ద్వంద వైఖరితో ఉంది. వైసీపీ సర్కార్ కు సహకరిస్తూనే.. వచ్చే ఎన్నికల్లో కూటమి కట్టాలన్న భావనతో ఉంది. అదే సమయంలో వైసీపీ పై విమర్శలు చేస్తోంది. టిడిపి విషయంలో కాస్త మినహాయింపుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పరిణామాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు ఢిల్లీ సర్వీసెస్ విషయంలో బిజెపికి సహకరించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఈ బిల్లునకు వైసిపి మద్దతు ప్రకటించింది.ఇప్పుడు తాజాగా టిడిపి డిసైడ్ కావడంతో ఏపీ సంపూర్ణ మద్దతు బిజెపి కేనని తేలింది.