Petrol Prices Increase: పెట్రో మంట మళ్లీ.. ఇంకెన్నాళ్లీ కష్టాలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత భారత్ కు చమురు సరఫరాలను రష్యా పెంచింది. ఈ యుద్ధానికి కంటే ముందు 2 శాతం మాత్రమే రష్యా చమురును కొనుగోలు చేసిన ఇండియా ఆ తరువత 44 శాతానికి పెంచారు.

Written By: Chai Muchhata, Updated On : July 10, 2023 9:05 am

Petrol Price Today

Follow us on

Petrol Prices Increase: భారత్ లో మరోసారి పెట్రోధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కాలం నుంచి ఇండియాలో పెట్రోల్ ధరలు రూ.100 కంటే దిగువకు రావడం లేదు. అయితే అంతర్జాతీయంగా వస్తున్న మార్పుల కారణంగా పెట్రో ధరలు పెరుగుతున్నాయని కేంద్రం చెబుతూ వస్తోంది. ఉక్రెయిన్-యుద్ధం కారణాన్ని కూడా పెట్రోల్ ధరలు పెరగడానికి కారణాన్ని చెప్పారు. ఆ తరువాత రష్యాతో భారత్ సత్సంబంధాలు నెరిపి భారత్ కు తక్కవకే చమురు అందించేలా ఒప్పందం చేసుకున్నట్లు చెప్పింది. అయితే చమురు రేటు తగ్గించినా దాని షిఫ్టింగ్ ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి మార్కెట్ ధరలకంటే అధికంగా ఉన్నాయి. పైగా ఇటీవల చమురు ధరల్లో డిస్కౌంట్లను 4 డాలర్లకు తగ్గించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా భారత్ లో మరోసారి పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత భారత్ కు చమురు సరఫరాలను రష్యా పెంచింది. ఈ యుద్ధానికి కంటే ముందు 2 శాతం మాత్రమే రష్యా చమురును కొనుగోలు చేసిన ఇండియా ఆ తరువత 44 శాతానికి పెంచారు. భారత్ లోని బీపీసీఎల్, ఐవోసీ, హెచ్పీసీఎల్ మిత్తల్ ఎనర్జీ, నయారా ఎనర్జీ వంటి సంస్థలు చములు కొనుగోలుకు ఒప్పందాలు ఏర్పరుచుకున్నారు. వీటితో పాటు ప్రభుత్వం ఆధీనంలోని సంస్థలతో కలిసి మొత్తం 60 శాతం రష్యా చమురును కొనుగోలు చేస్తున్నాయి.

పశ్చిమ దేశాలతో వైరం కారణంగా రష్యా భారత్ కు తక్కువ ధరకే చమురును విక్రయిస్తోంది. ప్రస్తుతం 60 డాలర్ల కంటే తక్కువే వసూలు చేస్తోంది. అయితే వీటిని భారత్ కు షిప్టింగ్ చేయడానికి మాత్రం అధికంగా వసూలు చేస్తోంది. రష్యా నుంచి భారత్ లోని పశ్చిమ తీరానికి చేరడానికి ఒక పీపాకు 11 నుంచి 19 డాలర్లను వసూలు చేస్తోంది. ఇది మార్కెట్ ధర కంటే అధికం. అయితే రష్యా వద్ద ఉన్న 100 కు పైగా ట్యాంకర్లను భారత్ కు తీసుకురానున్నారు. ఇలా చేయడం వల్ల అధిక భారం పడనుంది. ఈ ప్రభావం పెట్రోల్ ధరలపై పడుతుందని అంటున్నారు.

మరోవైపు ఇప్పటి వరకు రష్యా ప్రతీ పీపాపై 30 డాలర్ల డిస్కౌంట్ ఇచ్చేది. కానీ ఇప్పుడు దానిని 4 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయంగా మిగతా దేశాల కంటే భారత్ మాత్రమే ఎక్కువగా చమురును వినియోగిస్తోంది. పక్కున్న చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతో కొత్త ఆర్డర్లు పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో భారత్ లోని చమురు సంస్థల యజమానులు మూకుమ్మడిగా రష్యాను రిక్వెస్ట్ చేస్తే షిప్టింగ్ చార్జీల్లో మార్పుల వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ తరుణంలో భారత్ నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.