Kerala High Court: ప్రేమికురాలి విషయంలో కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రేమికురాలి అంగీకారం లేనిదే శృంగారంలో పాల్గొనకూడదని చెప్పింది. ఆమె సమ్మతి లేనిదే ఎలాంటి పని చేయకూడదని తేల్చింది. దీంతో ఆమె ఇష్టం లేకుండా లైంగిక చర్యలకు పాల్పడకూడదు. అలా చేస్తే అది అత్యాచారం కిందకే వస్తుందని చెప్పింది. ఈ విషయంలో ప్రేమికురాలికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇలా జరిగిన ఓ కేసులో కేరళ హైకోర్టు వాదనలు భిన్నంగా ఉన్నా సమ్మతమే అనిపించేలా ఉన్నాయి.
Also Read: ప్రియుడు మాట్లాడడం లేదని డయల్ 100కు ఫోన్ చేసిన లవర్

శ్యాం శివన్ అనే 26 ఏళ్ల యువకుడు తాను ప్రేమిస్తున్న బాలికను బెదిరించి మైసూరు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె నగలు విక్రయించి మళ్లీ గోవా తీసుకెళ్లాడు. అక్కడ కూడా మరోసారి అత్యాచారం చేశాడు. ఒప్పుకోకపోతే ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఆమెను తన వెంట తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించడంతో అతడిపై కేసు నమోదైంది.
దీనిపై కోర్టులో వాదనలు జరిగాయి. ప్రియుడితో వెళ్లిపోయిన యువతి ఎక్కడ కూడా ప్రతిఘటించలేదని దీంతో ఆమె అంగీకారం తెలిపిందని తెలుస్తోందని ప్రియుడి తరఫు న్యాయవాది వాదించగా అది ముమ్మాటికి తప్పని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. దీంతో కోర్టు ఆమెకే హైకోర్టు మద్దతు ప్రకటించింది.
సగటు మహిళ ఓ వ్యక్తిని ప్రేమించినంత మాత్రాన అతని చేష్టలకు అంగీకరించినట్లు కాదని పేర్కొంది. ఆమె ఒప్పుకుందని :ఊహించడం కూడా సరికాదని తెలిపింది. ఆమెను బలవంతంగా అనుభవించడం అంటే అత్యాచారం కిందకే వస్తుందని తీర్పు చెప్పి అతడికి శిక్ష విధించింది. దీంతో ఆమెకు న్యాయం జరిగిందని పలువురు వ్యాఖ్యానించారు.
Also Read: వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించాల్సిందే!