https://oktelugu.com/

ఏపీలో రేషన్ కార్డుల జారీ.. సీన్ రివర్స్ అయిందా?

ఒకప్పుడు రేషన్ కార్డు తీసుకోవాలంటే నానా అవస్థలు పడాల్సి వచ్చేది. రెవిన్యూ కార్యాయాల చుట్టూ ప్రజలు కాళ్లరిగేలా తిరిగేవారు. అధికారులు ఏ సమయంలో కార్యాలయాల్లో ఉంటారో.. ఉండారో తెలియక గంటలతరబడి కార్యాలయాల పడిగాపులు పడేవారు. అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక మాత్రం సీన్స్ రివర్ అయినట్లు కన్పిస్తోంది. కొత్త రేషన్ కార్డు ఎవరైనా ధరఖాస్తు చేసుకుంటే పదిరోజుల్లోనే అధికారులు పూర్తి చేస్తున్నారు. పదిరోజులు ఆర్జీ పెట్టుకున్న లబ్ధిదారుడికి కార్డు ఇవ్వకపోయినా.. లేదా ఎందుకు ఇవ్వలేదో కారణం […]

Written By: , Updated On : September 26, 2020 / 05:17 PM IST
Follow us on

ఒకప్పుడు రేషన్ కార్డు తీసుకోవాలంటే నానా అవస్థలు పడాల్సి వచ్చేది. రెవిన్యూ కార్యాయాల చుట్టూ ప్రజలు కాళ్లరిగేలా తిరిగేవారు. అధికారులు ఏ సమయంలో కార్యాలయాల్లో ఉంటారో.. ఉండారో తెలియక గంటలతరబడి కార్యాలయాల పడిగాపులు పడేవారు. అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక మాత్రం సీన్స్ రివర్ అయినట్లు కన్పిస్తోంది.

కొత్త రేషన్ కార్డు ఎవరైనా ధరఖాస్తు చేసుకుంటే పదిరోజుల్లోనే అధికారులు పూర్తి చేస్తున్నారు. పదిరోజులు ఆర్జీ పెట్టుకున్న లబ్ధిదారుడికి కార్డు ఇవ్వకపోయినా.. లేదా ఎందుకు ఇవ్వలేదో కారణం చెప్పకపోయినా ప్రభుత్వం వెంటనే సదరు అధికారులు సస్పెండ్ చేస్తోంది. దీంతో అధికారులు ఉరుకుల పరుగుల మీద ఆర్జీలను పరిష్కరిస్తున్నారు. రేషన్ కార్డుకోసం ఎవరైనా దరఖాస్తు చేసుకున్నారో వారి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అధికారులే ఇప్పుడు వారి చుట్టూ తిరుగుతున్నారు.

కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ అధికారులు కార్డు ఇస్తూ పోతున్నారు. అయితే వీటిలోనూ కొన్ని ఇబ్బందులు ఎదురవుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కార్డు కోసం ఆర్జీ పెట్టుకున్న తర్వాత లబ్ధిదారుడు వారి కుటుంబ సభ్యులు వేరే ఊరికి పనిమీద వెళ్తే.. ఈలోపు ఇక్కడ కార్డు మంజూరైనట్లు అయినట్టు వీఆర్వో అథెంటికేషన్ ఇచ్చేస్తే విషయం తారుమారవుతోంది. వీఆర్వో కార్డు మంజూరు చేసిన తర్వాత వెంటనే అర్జీదారుడు వలంటీర్ వద్దకు వెళ్లి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఇష్యూ కార్డ్, ఈకేవైసీ ప్రక్రియలు జరిగితేనే సదరు వీఆర్వో పనిచేసినట్టు లెక్క.

ఈ రెండు పనులను వీఆర్వో సరిగ్గా చేయపోతే రేషన్ కార్డులు పెండింగ్ చూపిస్తుంటాయి. కొన్నిసార్లు అధికారులకు అర్జీదారులు దొరకక.. వారి ఫోన్ నెంబర్ కరెక్ట్ గా లేకపోవడంతో అధికారులు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈకేవైసీ కాకపోతే వీఆర్వోలపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటోంది. దీంతో అధికారులు ఆర్జీదారులు ఎక్కడ ఉంటే అక్కడి వెళ్లి వేలిముద్రలు, ఈకేవైసీ తీసుకుంటున్నారట. ఇది చూసిన వారంతా జగన్ మార్క్ పాలన సాగుతోందని అంటున్నారు.