
ఇరాన్ అణుప్లాంట్ పై ఇజ్రాయేల్ దేశం సైబర్ దాడి చేసింది. ఇరాన్ అణు కర్మగారాన్ని అధ్యక్షుడు ప్రారంభించిన కొద్దిసేపటికే అక్కడ విద్యుత్ సరఫరా వ్యవస్థ అనూహ్యంగా కుప్పకూలింది.
దక్షిణ టెహ్రాన్ లోని నంతాజ్ కాంప్లెక్స్ వద్ద యూరేనియం శుద్ధిని వేగంగా చేపట్టేందుకు నిర్మించిన అధునాతన సెంట్రిఫ్యూజ్ లను ఇరాన్ అధ్యక్షుడు ప్రారంభించిన వెంటనే ఇజ్రాయేల్ సైబర్ దాడి చేసింది.
నతాంజ్ ప్లాంట్ లో అత్యంత కీలకమైన సెంట్రిఫ్యూజులు ఉండగా.. విద్యుత్ వ్యవస్థపై సైబర్ దాడి జరగడంతో అణుశుద్ధి కర్మాగారం అంతటా సరఫరా నిలిచిపోయిందని ఇరాన్ తెలిపింది.
ఇక ఇరాన్ అణు ప్లాంట్ పై దాడి వెనుక ఇజ్రాయేల్ ఉండొచ్చని అక్కడి ప్రభుత్వ అధికారిక మీడియా కాన్ వెల్లడించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. 10 ఏళ్ల క్రితం కూడా ఇరాన్ పై స్ట్రక్స్ నెట్ సైబర్ దాడిని కూడా ఇదే ఇజ్రాయేల్ నిర్వహించడం విశేషం.
ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తున్నట్టు ఇటీవలే అమెరికా ఆరోపించింది. అణు కార్యక్రమాలను నియంత్రించడానికి ఇరాన్ సహా దేశాల మధ్య 2015లో ఒప్పందం కుదిరింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై బయటకు వచ్చి ఇరాన్ పై ఆంక్షలు విధించారు. దీంతో ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయేల్ గుర్రుగా ఉన్నాయి.