Israel: ఒక మనిషి మీద ఎప్పుడు, ఎందుకు ప్రేమ పుడుతుందో చెప్పలేం. పుట్టిన ఆ ప్రేమని ఎదుటి మనిషితో వ్యక్తీకరిస్తే చాలు. సమ్మత మైతే పట్టాలెక్కుతుంది. లేకుంటే వన్ సైడ్ లవ్ గా మిగిలిపోతుంది. కానీ ఈ దేశంలో అలా కాదు. ఎదుటి వ్యక్తి యువతి లేదా యువకుడిని ప్రేమిస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెప్పాలట! లేకుంటే కఠిన శిక్షలు విధిస్తారట! ఏంటి ప్రేమిస్తే ప్రభుత్వానికి చెప్పాలా? ఇదేదో వింతగా ఉందనుకుంటున్నారా? అయితే చదవండి మరి. మరిన్ని వింత విషయాలు మీకు తెలుస్తాయి. పాలస్తీనా దేశం.. తెలుసు కదా! ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంతో వణికిపోతూ ఉంటుంది. దొరికిన ప్రాంతాలను ఇజ్రాయిల్ ఆక్రమించేస్తూ ఉంటుంది. తాను అక్రమించిన ప్రాంతాల్లో చిత్ర విచిత్రమైన నిబంధనలను తెరపైకి తెస్తుంది. ఇజ్రాయిల్ ఆక్రమిత ప్రాంతాల్లో ఒకవేళ గనుక ఒక మనిషి మరో మనిషిని ప్రేమిస్తే ఖచ్చితంగా ఆ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పాలి. లేకపోతే ఇక అంతే సంగతులు. ప్రస్తుతం పాలస్తీనాలోని చాలా ప్రాంతాలు ఇజ్రాయిల్ ఆధీనంలో ఉన్నాయి. ముఖ్యంగా వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఈ మధ్య రెండు కొత్త నిబంధనలు వచ్చాయి. వీటి ప్రకారం ఆక్రమిత వెస్ట్ బ్యాంకు ను సందర్శించే విదేశీయులు అక్కడి పాలస్తీనీయులతో ప్రేమలో పడితే, ఆ విషయాన్ని వారు ఇజ్రాయిల్ రక్షణ మంత్రిత్వ శాఖకు తెలియజేయాలి. అక్కడి పాలస్తీనియన్లను పెళ్లి చేసుకోవాలంటే కనీసం ఆరు నెలల పాటు కూలింగ్ ఆఫ్ పిరియడ్ ( లేదా ఏదైనా ఒక ఒప్పందానికి వేచి చూడాల్సిన సమయాన్ని కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటారు) ఇవ్వాల్సి ఉంటుంది. ఆపై 27 నెలలు అక్కడ గడిపిన తర్వాతే దేశం వదిలి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఇది వెస్ట్ బ్యాంకులో నివసిస్తున్న లేదా సందర్శించాలనుకునే విదేశీయులపై ఆంక్షలు కఠిన తరం చేయడంలో భాగంగా ఇజ్రాయిల్ రూపొందించిన నిబంధనలు. ఆంక్షలను ఇజ్రాయిల్ తారా స్థాయికి తీసుకెళ్తుందని, పాలస్తీనియన్లను, ఇజ్రాయల్ లో పనిచేసే ఎన్జీవోలను తొక్కిపెట్టేందుకే ఈ చట్టాన్ని రూపొందించిందని పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు.

పాలస్తీనా పౌరుడు లేదా పౌరురాలితో ఒక సంబంధాన్ని మొదలుపెట్టిన వ్యక్తి ఆ విషయాన్ని 30 రోజులకు ఇజ్రాయిల్ అధికారులకు తెలియజేయాలన్నది విదేశీయుల కోసం తయారు చేసిన నిబంధనల్లో ఒకటి. అయితే ఈ చట్టాన్ని జాత్యాంహకర చర్యగా పాలస్తీనా ప్రధానమంత్రి మహమ్మద్ ష్త య్యో హ్ అభివర్ణించారు. ఇజ్రాయిల్ తీసుకున్న నిర్ణయం పట్ల అమెరికా, యూరోపియన్ దేశాల దౌత్యవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ చట్టంపై ఇజ్రాయిల్ వెనక్కి తగ్గి కొన్ని అంశాలను సవరించింది. ఆ సవరించిన అంశాల ప్రకారం. వెస్ట్ బ్యాంకులో ఉన్న ఆ ప్రాంతాన్ని సందర్శించాలనుకుంటున్న విదేశీ యూనివర్సిటీ లెక్చరర్లు, స్టూడెంట్ల కోటా పై ఆంక్షలు ఎత్తివేశారు. ప్రతిపాదిత ఆంక్షల ప్రకారం పాలస్తీనా విశ్వవిద్యాలయాల్లో 150 మంది విదేశీ విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. విదేశీ లెక్చరర్ల కోటా మాత్రమే పరిమితం. అయితే ఈ నిబంధనలు విధిస్తున్న ఇజ్రాయిల్ తన దేశంలో మాత్రం ఎటువంటి పరిమితులు విధించలేదు.
Also Read: Janasena-BJP Merger: పవన్ కల్యాన్ సీఎం: బీజేపీ.. జనసేన.. ఓ విలీన రాజకీయం?
ఇజ్రాయిల్ విధించిన ఈ నిబంధనల కారణంగా తాము తీవ్రంగా ప్రభావితం అవుతున్నామని వ్యాపారవేత్తలు, సహాయ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నియమాలు వీసాలు, వీసా పొడిగింపుల వ్యవధిపై కఠినమైన పరిమితులు విధిస్తున్నాయి. కాకుండా అనేక సందర్భాల్లో పాలస్తీనా ప్రజలు కొన్ని నెలల కంటే ఎక్కువ కాలం వెస్ట్ బ్యాంకులో పని చేయకుండా నిబంధనలు అడ్డుకుంటున్నాయి. ఇది పాలస్తీనా సమాజాన్ని మిగిలిన ప్రపంచం నుంచి వేరు చేయడమే అని ఆరోపిస్తూ ఇజ్రాయిల్ కు చెందిన ఎన్జీవో హా మెక్డ్ డైరెక్టర్ జెస్సికా మోంటల్ ఇజ్రాయిల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇజ్రాయిల్ 1967 మిడిల్ ఈస్ట్ యుద్ధంలో జోర్డాన్ నుంచి వెస్ట్ బ్యాంకు ను స్వాధీనం చేసుకుందని, ఇజ్రాయిల్ రక్షణ మంత్రిత్వ శాఖ విభాగమైన కోగాట్ పాలస్తీనా భూభాగంలో ఈ ఆక్రమిత ప్రాంత పరిపాలన బాధ్యతలను చూస్తోందని ఆరోపించారు. ఇటీవల కోగాట్ 97 పేజీలతో కూడిన నిబంధనలను విదేశీయుల కోసం ప్రకటించింది. ఇజ్రాయిల్ తో పాటు వెస్ట్ బ్యాంక్ లోని పాలస్తీనా నియంత్రణలో ఉన్న ప్రాంతాలు, యూదుల నివాసాలను సందర్శించే వారికి ఈ కొత్త నిబంధనలు వర్తించవు. అక్కడ ప్రవేశించే విషయంలో ఇజ్రాయిల్ ఇమ్మిగ్రేషన్ అధికారులే నిర్ణయాలు తీసుకుంటారు. ఇక వెస్ట్ బ్యాంకులో నివసించే పాలసీనియన్ల విదేశీ జీవిత భాగస్వాములకు రెసిడెన్సి హోదాను మంజూరు చేయడంపై సుదీర్ఘకాలంగా ఇజ్రాయిల్ నిషేధం విధించింది. దీనివల్ల వేలాది మంది ప్రజలు చట్టపరంగా అనిచ్చిత హోదాలో నివసిస్తున్నారు.

ఇక కొత్త నియమాల ప్రకారం వెస్ట్ బ్యాంకు ను మాత్రమే సందర్శించేందుకు వచ్చే విదేశీ సందర్శకులు జోర్డాన్ లో ల్యాండ్ క్రాసింగ్ ల ద్వారా మాత్రమే ప్రయాణించాలి. అసాధారణమైన సందర్భాలలో మాత్రమే ఇజ్రాయిల్ లోని బెన్ గురియన్ విమానాశ్రయాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇజ్రాయిల్ తీసుకొచ్చిన నిబంధనలపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు హైకోర్టు తిరస్కరించింది. కోగాట్ రూపొందించిన ఈ నిబంధనలపై విచారణ జరపడం తొందరపాటు అవుతుందని హైకోర్టు పేర్కొంది. కాగా కోగాట్ తీసుకున్న నిర్ణయం వల్ల విదేశాల నుంచి వచ్చే నిపుణులు రాక పోవడం వల్ల ఆ ప్రభావం వివిధ రంగాల మీద పడుతుందని వ్యాపారవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయిల్ చేసిన యుద్ధం వల్ల పాలస్తీనా సర్వనాశనం అయిందని, ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న తమ దేశంపై ఇజ్రాయిల్ ఇలా ఆంక్షలు విధించడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Operation Lotus: వికటిస్తున్నా ఆపరేషన్ లోటస్.. మూడు రాష్ట్రాల్లో బెడిసి కొట్టిన వ్యూహాలు!