
లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, సైకోలు, శాడిస్టులు పెట్టే అసత్యవార్తలను నమ్మొదని, కరోనా వైరస్ ఒక వ్యక్తి మరో వ్యక్తిని తాకడం వల్ల మాత్రమే వ్యాప్తి చెందుతోందని ఇది గాలితో వచ్చే వ్యాధి కాదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను సందర్శించిన ఈటెలా ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గచ్చిబౌలిలో 1500 మందికి క్వారంటైన్ చేసేలా ఏర్పాటు చేశాం. 15 రోజుల్లోగా 1500 మందికి సరిపడా ఐసోలేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో ఒక్క వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా లేదు. ప్రజలను భయాందోళనకు గురి చేయవద్దని ప్రసార మాధ్యమాలను కోరుతున్నా. కరోనా వ్యాప్తిపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షలు జరిపారు. కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారితోనే కరోనా వ్యాపించింది. గాంధీ, కింగ్ కోఠి, చెస్ట్ హాస్పిటల్ ను కరోనా పేషెంట్ల కోసం కేటాయించినట్లు ఈటెల తెలిపారు.
కరోనా నియంత్రణకు ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి వల్ల ఆరుగురికి కరోనా వచ్చింది. కాంటాక్ట్ లేకుండా కరోనా సోకదు. ఎయిర్ పోర్టులో పనిచేసే వారికి కూడా కరోనా వచ్చింది. పాజిటివ్ వచ్చిన అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. హైదరాబాద్ లో రెడ్ జోన్లు లేవు. హైదరాబాద్‌లో రెడ్ జోన్లు ఉన్నాయన్న వార్తలు అవాస్తవం” అని మంత్రి కోరారు.