Telangana: తెలంగాణలో బీజేపీ మెల్లగా విస్తరిస్తోంది. ఇప్పటికే దుబ్బాక, హుజురాబాద్ లో విజయం సాధించి అధికార పార్టీకి సవాలు విసురుతోంది. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మెరుగైన స్థానాలు చేజిక్కించుకుని టీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ముందుకు దూకుతోంది. ఈ నేపథ్యంలో దుబ్బాక శాసనసభ్యుడు రఘునందన్ రావు మరో సంచలన ప్రకటన చేశారు.

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దు కావచ్చనే ఊహాగానాల క్రమంలో మరో ఉప ఎన్నిక రావచ్చని జోస్యం చెబుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ స్థానాలు తగ్గిపోతున్న క్రమంలో మళ్లీ ఉప ఎన్నిక వస్తే పరిస్థితి ఏంటని టీఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకుంది. దీంతో వేములవాడ స్థానంపై టీఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది. ఈ మేరకు రఘునందన్ రావు వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీలో గందరగోళం ఏర్పడింది.
హుజురాబాద్ లో విజయం సాధించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఫలితంగా పరువు పోయింది. అధికార పార్టీ నేతలు తలెత్తుకోవడం లేదు. దీంతో ఇన్నాళ్లు తమ పార్టీకి ఎదురులేదని చెబుతున్న టీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పినట్లు అయిందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలే సూచనలు ఉండటంతో ఏం చేయాలనే ఆలోచనలో పడిపోయింది.
అధికార పార్టీ నేతలతో పాటు పలువురు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొందరు బీజేపీలో చేరతామని అడుగుతున్నారని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రతిష్ట పెరగడంతో పలువురు నేతలు పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అధికార పార్టీకి తిప్పలు తప్పవేమో అని అందరిలో చర్చ జరుగుతోంది.
Also Read: Huzurabad By Poll Results: కేసీఆర్ కు చెక్: హుజూరాబాద్ లో గెలిచింది ‘ప్రజలే’