Vanama Raghava: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఇప్పుడు మరో వీడియో బయటకు వచ్చింది. ఇంతకు ముందు వచ్చిన మొదటి వీడియో ఎంతలా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. మొదటి వీడియోలో తన కుటుంబం చావుకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవరావు కారణం అంటూ రామకృష్ణ చెప్పారు. కాగా ఈ వీడియో మీద అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
Vanama Raghava
దీంతో ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ఆయన్ను నిన్న రాత్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో మందలపల్లి అడ్డరోడ్డు దగ్గర అరెస్టు చేశారు పోలీసులు. కాగా ఆయన్ను నిన్న రాత్రి నుంచి సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామకృష్ణ సూసైడ్‌కు ముందు తీసిన మరో సెల్ఫీ వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది. అందులో కీలక విషయాలను రామకృష్ణ చెప్పుకొచ్చారు. ఆ వీడియో బయటకు వచ్చే సరికి తాను బ్రతికి ఉండబోనంటూ కూడా చెప్పుకొచ్చాడు.
Also Read: నా చావుకు రాఘవనే కారణం.. రామకృష్ణ మరో వీడియో బయటకు..
ఇక తన అక్క మాధవికి, రాఘవకు 20 ఏండ్లుగా అక్రమ సంబంధం ఉందని, ఇందుకు తన తల్లి సహకరిస్తోందంటూ చెప్పుకొచ్చారు రామకృష్ణ. వారు ముగ్గురూ కలిసి తనకు ఆస్తిలో వాటా రాకుండా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తిలో వాటా విషయం మీద ఏడాది కింద పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం కూడా రాసుకున్నామని.. కానీ దాన్ని అమలు చేయకుండా తన కుటుంబాన్ని అప్పుల పాలు చేశారంటూ ఆవేదన చెందాడు రామకృష్ణ.
ఈ విషయంలోకి రాఘవ వచ్చి తనను బెదిరించాడని.. ఆస్తిలో రూపాయి కూడా రాదంటూ బెదిరించాడని రామకృష్ణ ఆ వీడియోలో వాపోయాడు. మొదటి వీడియోలో అక్రమ సంబంధం గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు రెండో వీడియోలో తన అక్కకు, రాఘవకు ఉన్న అక్రమ సంబంధం గురించి చెప్పడం సంచలనం రేపుతోంది. అంటే ఈ కేసులో ఇంకా చాలా విషయాలు బయటపడాల్సి ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=NFYyS0E3Zak
Also Read: ఎట్టకేలకు పోలీసుల అదుపులోకి వనమా రాఘవ.. రాజమండ్రికి పారిపోతుండగా అరెస్ట్..