Pushpa OTT: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా మొత్తానికి 18వ రోజు కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే, మూడో వారంలో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. మొదట ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్ళనే రాబడుతూనే ఉంది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ సినిమా అనూహ్యంగా ఆ తర్వాత బాగా పుంజుకుంది. కాగా బాక్సాఫీసు వద్ద పుష్ప సినిమా రిలీజ్ అయి 3 వారాల అవుతున్నా.. తన ప్రభావాన్ని బాగానే చూపిస్తోంది.
గుంటూరు 5.30 కోట్లు
కృష్ణా 4.18 కోట్లు
నెల్లూరు 3.09 కోట్లు
నైజాం 36.75 కోట్లు
సీడెడ్ 14.30 కోట్లు
ఉత్తరాంధ్ర 7.90 కోట్లు
ఈస్ట్ 4.87 కోట్లు
వెస్ట్ 4.10 కోట్లు
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 80.49 కోట్లు
కర్ణాటక 10.50 కోట్లు
రెస్ట్ 32.50 కోట్లు
ఓవర్సీస్ 13.00 కోట్లు
తమిళ్ నాడు 10.50 కోట్లు
కేరళ 5.15 కోట్లు
Also Read: ‘పుష్ప’ కొత్త సీన్లు.. ఇక ‘ఊ’ అనాల్సిందే !
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 152.14 కోట్లు ఈ చిత్రం రాబట్టింది.
‘పుష్ప’ అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. మూడు వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ. 152.14 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. అంటే ఈ సినిమా పూర్తి లాభాల్లోకి వచ్చేసింది. ఇక నుంచి కలెక్షన్స్ మరియు మిగిలిన అన్ని రైట్స్ తాలూకు డబ్బులు అన్నీ లాభాల కిందకే వస్తాయి. కాకపోతే ఈ చిత్రం అన్నీ చోట్ల బ్రేక్ ఈవెన్ ను సాధించినా.. ఆంధ్రలో మాత్రం నష్టపోయింది. అయితే, ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి ‘అల్లు అర్జున్’ చేసిన ఈ పాన్ ఇండియా ప్రయత్నం పర్వాలేదు అనిపించుకుంది. మొత్తమ్మీద ఓటీటీలోకి వచ్చిన ‘పుష్ప’ ఊపు మాత్రం తగ్గలేదు.
Also Read: ‘పుష్ప’ పై సినీ ప్రముఖుల అతి ప్రేమ !