India-China: డ్రాగన్ దేశం చైనాకు, మన ఇండియాకు వైరం ముదురుతోంది. ఏ క్షనం ఏం జరుగుతుందో అనే భయాందోళన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సెకండ్ లాక్‌డౌన్ సమయంలో చైనా, ఇండియన్ జవాన్ల మధ్య జరిగిన ఫైటింగ్ అప్పటి నుంచే రెండు దేశాల మధ్య అగ్గి రాజుకుంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా అనేక చర్చలు జరిగినప్పటికీ.. ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పాంగోంగ్ త్సో నది మీద చైనా ప్రభుత్వం ఏకంగా బ్రిడ్జి నిర్మించింది. గల్వాన్ లోయలో చైనా జెండా ఎగురవేయడం కూడా ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీస్తోంది.

రెండు దేశాల నడుమ ఉన్న సరిహద్దు మీద ఆధిపత్యం చెలాయించేందుకు చైనా అడుగులు వేస్తోందనే వార్తలు తీవ్ర అలజడి రేపుతున్నాయి. ఇక చైనా దూకుడు మీద అటు ప్రతిపక్షాల నుంచి, ఇటు ఇతర వర్గాల నుంచి కేంద్రం మీద తీవ్ర ఒత్తిడి వస్తోంది. కాగా ఇప్పటి దాకా కేంద్రం నుంచి కూడా ఓపికతో కూడిన సమాధానాలు వచ్చాయి. ఇంకో పక్క చూస్తుంటే.. చైనా దేశంలో త్వరలోనే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ జరగుతోంది.
Also Read: మోదీ పంజాబ్ టూర్ పై ఆరోపణ, ప్రత్యారోపణలు: ఎవరిది తప్పు?
ఈ ఏడాది మూడోసారి జీ జిన్‌పింగ్ ఎన్నికలకు వెళ్తున్నారు. మరోసారి గెలవాలని జిన్ పింగ్ భావిస్తున్నారు. కాబట్టి విమర్శలకు మనసులు గెలవడంతో పాటు.. జాతీయవాద నాయకుడిగా మరింత ప్రతిష్టను పెంచుకోవాలనేది జిన్ పింగ్ ఆలోచన. ఇది జరగాలంటే సెంటిమెంట్‌ను రాజేయడం కోసం జిన్ పింగ్ ఇలా సహచర దేశాలపై తన హవాను చూపించుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఇలాంటి దూకుడు నిర్ణయాలను తీసుకుంటున్నారు.
అయితే ఇటు వైపు కేంద్రం కూడా కొంత ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో దూకుడు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని సంయమనం పాటిస్తోంది. ఒకవేళ దూకుడు నిర్ణయాలు తీసుకుంటే అది చైనాలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌కు లాభం చేకూర్చుతుందనే ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దూకుడు నిర్ణయాలు తీసుకోవట్లేదని నిపుణులు వెల్లడిస్తున్నారు.
Also Read: ప్రధానమంత్రి భద్రతాలోపంపై రాజకీయాలా?