https://oktelugu.com/

చదువు నేర్పిన మూర్ఖత్వం.. : బిడ్డలను చంపుకున్న కన్నపేగు..

కుటుంబం మొత్తం మంచి విద్యావంతులు.. ఆర్థికంగా మంచిగా ఉన్నవారు.. తండ్రి డబుల్ పీహెచ్ డీ.. తల్లి ఓ కళాశాలనే నడిపిస్తోంది. పెద్ద కూతురు అత్యున్నత సివిల్స్ కు సిద్ధం అవుతోంది. చిన్న కూతురు ప్రజలకు సేవలందించేందుకు డాక్టర్ కావాలని చదువుతోంది. ఈ క్రమంలో వారు తీసుకున్న నిర్ణయం.. కలకలం రేపుతోంది. ఎన్నో హత్య కేసులను చూసిన పోలీసులకు సైతం బిత్తరపోయే నిజాలు తెలుస్తున్నాయి.. ఈ ఘటన విషయంలో.. Also Read: మద్యం ప్రియులకు శుభవార్త చెప్పిన తెలంగాణ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 26, 2021 / 03:12 PM IST
    Follow us on


    కుటుంబం మొత్తం మంచి విద్యావంతులు.. ఆర్థికంగా మంచిగా ఉన్నవారు.. తండ్రి డబుల్ పీహెచ్ డీ.. తల్లి ఓ కళాశాలనే నడిపిస్తోంది. పెద్ద కూతురు అత్యున్నత సివిల్స్ కు సిద్ధం అవుతోంది. చిన్న కూతురు ప్రజలకు సేవలందించేందుకు డాక్టర్ కావాలని చదువుతోంది. ఈ క్రమంలో వారు తీసుకున్న నిర్ణయం.. కలకలం రేపుతోంది. ఎన్నో హత్య కేసులను చూసిన పోలీసులకు సైతం బిత్తరపోయే నిజాలు తెలుస్తున్నాయి.. ఈ ఘటన విషయంలో..

    Also Read: మద్యం ప్రియులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ..?

    చిత్తూరు జిల్లా మదనపల్లె శివారులో చోటు చేసుకున్న జంట హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఉన్నత విద్యావంతుల కుటుంబంలో చోటు చేసుకున్న ఈ దుష్పరిణామాలు.. అస్సలు మింగుడు పడడం లేదని పోలీసులు అంటున్నారు. మనసు నిండా మూఢత్వాన్ని నింపుకున్న ఆ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు.. తెలుసుకున్న వారంతా భయబ్రాంతుకు గురవుతున్నారు. వారికి ఇదెక్కడి పైత్యం రా బాబూ.. అంటూ ముక్కన వేలేసుకుంటున్నారు.

    హత్యకు గురైన అక్కా చెల్లెళ్లను మొదట కన్న తల్లే చంపిందని అంతా భావించారు. పోలీసులు కూడా ఇది నమ్మారు. కాగా.. చెల్లెల్ని అక్క చంపడం.. తనను చంపితే.. తాను వెళ్లి చెల్లెలి ఆత్మను తీసుకొస్తానని అక్క చెప్పిందని పోలీసుల విచారణలో తల్లి పద్మజ చెప్పింది. ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఆ కుటుంబంలోని వారంతా విద్యావంతులే.. తండ్రి ప్రభుత్వ మహిళా కళాశాలలో వైస్ ప్రినిపాల్.. తల్లి మదనపల్లెలో పేరొందిన విద్యాసంస్థకు కరస్పండెంట్. ఈ సంస్థలో దాదాపు 800మంది విద్యార్థులు చదువుతున్నారు.

    పురుషోత్తం నాయుడు కుటుంబం పాతికేళ్ల క్రితం మదనపల్లెకు వచ్చింది. మడేళ్ల క్రితం నగర శివారులో మూడంతస్తుల ఇల్లు కట్టుకున్నారు. మొత్తం ఇంట్లో వారే ఉంటున్నారు. వీరికి దైవ భక్తి ఎక్కువ. తరుచూ ఆధ్యాత్మిక అంశాలే చర్చకు వచ్చేవి. ఏ చిన్న శారీరక సమస్య వచ్చినా.. అదంతా.. బాబా వల్లే.. అంటూ సాధ్యంటూ.. చెప్పుకొచ్చేవారు. వారం క్రితం వారి పెంపుడు కుక్కను అక్క చెల్లెళ్లు ఇద్దరు వాకింగ్ కు తీసుకెళ్లారు. రోడ్డుపై వేసిన ముగ్గులో ఉంచిన ముగ్గులో నిమ్మకాయలు.. కుంకుమ తొక్కారని.. ఆ విషయాన్ని ఇంటికొచ్చాక తల్లిదండ్రులకు చెప్పారు. తరువాత ఏం జరుగుతుందో అన్న భయం వారిని వెంటాడింది. అప్పటినుంచి వారు మౌనంగా ఉన్నారు. ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయని చెప్పుకునేవారు.

    Also Read: దేశ చరిత్రలో ఈ దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేం

    ఈ నేపథ్యంలో సరిహద్దు రాష్ర్టం అయిన తమిళ నాడు నుంచి ఒక మంత్రగాడిని సంప్రదించారు. అతడిచ్చిన తవిత్తు వేసుకున్నారు. అప్పటి నుంచి వారు.. పిల్లలు బయటకు వెళ్లడం మానేశారు. కనీసం తల్లి దండ్రలు కళాశాలకు కూడా వెళ్లడం లేదు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో పూజలు చేశారు. ఈ క్రమంలో పై అంతస్తులో ఉన్న సాయిదివ్య(చిన్నకూతురు) కేకలు వేస్తూ.. మానసిక రోగిలా ప్రవర్తించింది. సోదరి.. తల్లిదండ్రులు.. ఆమెకు దెయ్యం పట్టిందని డంబెల్ తో కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది.

    చనిపోయిన సాయిదివ్య నుదిపై ముగ్గులు వేసి.. ఆమె ఆత్మను బయటకు వెళ్లకుండా.. తాను బంధించినట్లు పేర్కొంది పెద్ద కూతురు. ముగ్గరూ.. నగ్నంగా ఇంట్లో పూజలు చేశారు. ఆమెను బతికించి తీసుకొస్తానని.. ఇందుకు తనను కూడా చంపాలని పెద్ద కూతురు తల్లితో చెప్పింది. దీంతో ఆమె నోట్లో కలశం పెట్టిన తల్లి.. తలపై డంబెల్తో కొట్టడంతో చనిపోయింది. అనంతరం వారి స్మార్ట్ ఫోన్ పగలగొట్టంది.

    అనంతరం తండ్రి పురుషోత్తం నాయుడు తన సహచరుడికి ఫోన్లో విషయం చెప్పాడు. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. డెడ్ బాడీలను మార్చురీలకు తరలిస్తుండగా.. తాను కాళికనయ్యాయని.. బిడ్డలిద్దరూ.. పుణ్యలోకాల్లో ఉన్నారని తల్లి.. పెద్దగా అరుస్తూ.. అడ్డకుంది. అయినా పోలీసులు కేసు నమోదు చేసి.. తండ్రి చేతుల మీదుగా.. ఇద్దరు పిలల్లకు అంత్యక్రియలు పూర్తి చేశారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్