జగన్ కు భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవా?

రాజకీయ నాయకుడికి సమయస్ఫూర్తి తప్పనిసరి. ఎప్పుడు ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలనే దానిపై సముచిత ప్రాధాన్యం ఇస్తుండాలి. దేనికి దూకుడు పెంచాలి. ఎందులో సంయమనం పాటించాలి అనే వాటిపై గుర్తెరిగి ఉండాలి. లేకపోతే దెబ్బ తింటాం. మనం తీసుకునే ఆలోచన అందరికి మేలు చేసేదిగా ఉండేలా చూసుకోవాలి. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. తెలంగాణ-ఏపీ మధ్య ప్రస్తుతం జల వివాదాలు ఏర్పడ్డాయి. […]

Written By: Srinivas, Updated On : July 12, 2021 9:52 am
Follow us on

రాజకీయ నాయకుడికి సమయస్ఫూర్తి తప్పనిసరి. ఎప్పుడు ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలనే దానిపై సముచిత ప్రాధాన్యం ఇస్తుండాలి. దేనికి దూకుడు పెంచాలి. ఎందులో సంయమనం పాటించాలి అనే వాటిపై గుర్తెరిగి ఉండాలి. లేకపోతే దెబ్బ తింటాం. మనం తీసుకునే ఆలోచన అందరికి మేలు చేసేదిగా ఉండేలా చూసుకోవాలి. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదనే అపవాదును మూటగట్టుకుంటున్నారు.

తెలంగాణ-ఏపీ మధ్య ప్రస్తుతం జల వివాదాలు ఏర్పడ్డాయి. గతంలో స్నేహపూర్వకంగా ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రస్తుతం శతృత్వం పెంచుకుంటున్నారు. అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. గతంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ర్ట విభజనతో ఎల్లకాలం వివాదాలు కొనసాగుతాయని చెప్పారు. ఇప్పుడు అదే నిజమవుతోంది. ఈ వివాదం ఇలాగే కొనసాగితే చిరకాల సమస్యగా రూపాంతరం చెందే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిజానికి జల వివాదాలు అన్ని ప్రాంతాల మధ్య ఉన్నాయి. కర్ణాటక- ఆంధ్రప్రదేశ్ కు ఆల్మట్టి, కర్ణాటక- మహారాష్ర్ట మధ్య కూడా జల వివాదాలు ఉన్నాయి. వీటికి పరిష్కారం చర్చల ద్వారానే అని తెలిసినా పాలకులు పట్టించుకోవడం లేదు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం తమ ఇగోలను పక్కన పెట్టకుండా ప్రజలను బాధ్యులను చేస్తున్నారు. ఫలితంగా నాయకుల మధ్య ఆరోపణలు సైతం పెరిగాయి. ఈ నేపథ్యంలో జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తెలంగాణ-ఏపీ మధ్య నెలకొన్న జల వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిపుణులు చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. దీంతో ఎలాంటి ప్రయోజనం లేదని తెలిసినా పాలకుల మధ్య అవగాహన లేకపోవడంతోనే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కోర్టుల చుట్టు తిరిగితే సంవత్సరాల పాటు వాయిదాలు వేసుకోవాల్సి వస్తుందే తప్ప పరిష్కారం రాదు. ఈ విషయాన్ని గమనించి పాలకులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి.