పవన్ కళ్యాణ్ సైలెన్స్ వెనుక ఇంత వైలెంటా?

ఏదైనా పెద్ద పనిచేస్తుంటే.. ‘ఎంత సైలెంట్ గా ఉంటే.. దాని ప్రతిఫలం అంత వైలెంట్’గా వస్తుందంటారు. రాజకీయవర్గాల్లో చేసే ఏ పెద్ద పని అయినా ప్రత్యర్థులు తెలుసుకోకుండా.. వ్యూహాత్మకంగా చేయాలి.. ఏది మన కేసీఆర్ ‘ఓటుకు నోటు’లో చంద్రబాబును ఇరికించిన చందంగా చేయాలన్నమాట.. బయటపడే వరకు ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఉంచాలి.. బయటపడ్డాక నోరెళ్లబెట్టడం అందరి వంతవుతుంది. Also Read: అట్టడుగు స్థానంలో ఏపీ..! ఇలా ఉంటే కష్టమే జగన్ ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ […]

Written By: NARESH, Updated On : August 29, 2020 12:08 pm
Follow us on


ఏదైనా పెద్ద పనిచేస్తుంటే.. ‘ఎంత సైలెంట్ గా ఉంటే.. దాని ప్రతిఫలం అంత వైలెంట్’గా వస్తుందంటారు. రాజకీయవర్గాల్లో చేసే ఏ పెద్ద పని అయినా ప్రత్యర్థులు తెలుసుకోకుండా.. వ్యూహాత్మకంగా చేయాలి.. ఏది మన కేసీఆర్ ‘ఓటుకు నోటు’లో చంద్రబాబును ఇరికించిన చందంగా చేయాలన్నమాట.. బయటపడే వరకు ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఉంచాలి.. బయటపడ్డాక నోరెళ్లబెట్టడం అందరి వంతవుతుంది.

Also Read: అట్టడుగు స్థానంలో ఏపీ..! ఇలా ఉంటే కష్టమే జగన్

ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ మౌనం వెనుక కూడా పెద్ద కథే ఉందని విశ్వసనీయ సమాచారం. పవన్ కళ్యాణ్ ఏదో మాలధారణ చేసుకొని ఏపీ రాజకీయాలకు దూరం జరగడం వెనుక బీజేపీ ప్లాన్ ఉందన్నది జనసేన నుంచి లీకైన వార్తలను బట్టి తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీపై అస్సలు కాన్ సెంట్రేషన్ చేయడం లేదు. కనీసం అప్పుడో ఇప్పుడో స్పందించే ట్విట్టర్ లోనైనా ట్వీట్ చేయడం లేదు. పవన్ కళ్యాణ్ ఇంతటి నిశ్శబ్ధం ఎప్పుడూ చూడలేదు. ఇన్నాళ్లు ఆయన కరోనా కారణంగా ఏపీలో అడుగుపెట్టలేదు అని అంతా భావించారు. ఏపీలో ఎన్ని సమస్యలున్నా.. ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ పోరాడుతున్న పవన్ మాత్రం ఇటు వైపు చూడడం లేదు. దీనివెనుక కారణం ఏంటని ఆరాతీయగా అసలు విషయం బయటపడిందట..

పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో మౌనం దాల్చడం వెనుక ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ సూచనలేనన్న ప్రచారం సాగుతోంది. బీజేపీ వాళ్లు ఇంకొన్ని రోజులు సైలెంట్ గా ఉండమని పవన్ కు చెప్పారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.. ఎందుకంటే బీజేపీ బలపడాలంటే ఇప్పుడే జరగాలని.. టీడీపీలో అసమ్మతి వాళ్లను చేర్చుకోవాలని పెద్ద ప్లాన్ వేసిందట…. ఆ తర్వాత జనసేనను బీజేపీలో కలిపేసుకొని ఇంకా బలపడాలని బీజేపీ ప్లాన్ చేసిందని వినికిడి.

Also Read: ‘రక్తపాత దినోత్సవం ఎఫెక్ట్’ : సాయి రెడ్డికి రక్త కన్నీరు తెప్పించింది

టీడీపీని నిర్వీర్యం చేయడానికి వైసీపీ కూడా సహకారం అందిస్తోందట.. అందుకే తాజాగా టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల పై కేసులు, వారి మైనింగ్ లీజుల రద్దు సహా టీడీపీ నేతలను అభద్రతభావానికి గురిచేసి వారందరినీ బీజేపీలో చేరడానికి అవకాశం కల్పిస్తోందని టాక్..

ఇదంతా పూర్తయ్యాక జనసేనను విలీనం చేసుకొని పవన్ ను బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా మార్చి సోము వీర్రాజు సారథ్యంలో 2024లో ఏపీ అధికారం చేపట్టాలని బీజేపీ ప్లాన్ చేసిందని సమాచారం.. ఇదంతా వర్కవుట్ కావాలంటే ప్రస్తుతానికి జనసేనాని సైలెంట్ గా ఉండాలని సూచించారట.. అందుకే పవన్ కళ్యాణ్ మాల ధరించి ఆధ్మాత్మికంలో మునిగిపోయారని.. ఇంకొద్ది రోజులు ఏపీ వంక చూడరని అంటున్నారు.