Pawan Kalyan: “ చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు “ – అనే మాట అప్పుడే వస్తుందని అటు వైపు వాళ్లెవ్వరూ కనీసం అనుకొని కూడా ఉండరు. కానీ వచ్చేసింది. అదేంటి, ఈ సారి మనం 175 సీట్లూ గెలుస్తామని కదా చెప్పుకుంటున్నాం, అంతలోనే ఇలా అనడం ఏంటి అని అవతలపక్క అర్థం కావడం లేదు. అంటే గ్రౌండ్ లూజ్ అవుతున్నామని ఇప్పటికి తెలిసిందా అని మూడొంతుల మంది ఫీలింగ్ !

నిజానికి మూడున్నరేళ్లు మరీ ఎక్కువేం కాదు. మామూలుగా అయితే ఈ టైమ్ కి వ్యతిరేకత కనపడదు. మూడున్నరేళ్లకే కదా చంద్రబాబు నంద్యాల బైఎలక్షన్ గెలిచాడు. బంపర్ గా ! ఆ తర్వాత కథ మారింది. అలాంటిది ఇప్పుడే బాబు సీఎం కావాలనుకుంటున్నాడు మళ్లీ – అనే విసురు కూడా ఆ ఏరియా పర్యటనలోనే వచ్చింది. అంటే మూడున్నరేళ్లకే చాలా సినిమా ముగిసిందని అర్థం చేసుకోవాలా !
ఇంకోమాట. ముందస్తు ఎప్పుడైనా రావొచ్చు అని చంద్రబాబు గత వారమే అన్నాడు. ఇంతలో పవన్ విశాఖ అలజడి. ఈ బ్యాక్ డ్రాప్ లో ఇవాళ బాబు పవన్ మీటింగ్. విశాఖ పరిణామాలపై సంఘీభావం చెప్పడం కోసమే సమావేశం అని అంటున్నా, అసలు భావం ఏంటో అందరికీ అర్థం అవుతోంది. అంటే యుద్ధ సన్నద్ధం మొదలైయ్యిందన్నమాట. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా నోరు జారడు. ఒకవేళ జనసేన పార్టీ కార్యకర్తలు నోరు జారినా తాను ఊరుకోడు. ఎంత ఎదిగినా ఒదిగే మనస్తత్వం పవన్ కళ్యాణ్ ది. అప్పుడెప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలో కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ లో పనిచేసే ఓ విద్యుత్ కార్మికుడి కూతురు చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు.. పవన్ కళ్యాణ్ నేరుగా ఆమె వద్దకు వెళ్లాడు. ధైర్యం చెప్పాడు.. కంటనీరు పెట్టుకున్నాడు. హాస్పిటల్ ఖర్చులు మొత్తం తానే భరించాడు. అసలు బతకదు అనుకున్న అమ్మాయి ఇప్పుడు బీటెక్ పూర్తి చేసింది. అంటే ఒక మనిషిని ప్రేమిస్తే ఏదైనా చేయగలడు అనే అర్ధానికి సిసలైన నిర్వచనం పవన్ కళ్యాణ్.
చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడు
గత కొద్ది రోజుల నుంచి వైఎస్ఆర్సిపి నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అప్పట్లో అమరావతి రాజధాని ఏర్పాటుకు ఒప్పుకొని.. ఇప్పుడు పరిపాలన వీకేంద్రీకరణ పేరుతో ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్న జగన్ తీరుపై ఆది నుంచి పవన్ కళ్యాణ్ ఆగ్రహం గా ఉన్నారు. అప్పట్లో చంద్రబాబుకు మద్దతు తెలిపినప్పుడు కూడా సి ఆర్ డి ఏ పరిధిలో ఉన్న రైతులకు న్యాయం చేయాలని నిరసన దీక్షలు కూడా చేశాడు. ఇక ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు స్థాయికి మించి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. ఇవి తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో సాగుతున్నాయి.

అయితే ఇప్పటిదాకా ఓపిక పట్టిన పవన్ కళ్యాణ్.. ఇక లాభం లేదనుకుని ఇవాళ అగ్గిపిడుగు లాగా బద్దలైపోయాడు. తనపై, తన వ్యక్తిత్వంపై దూషణలు చేసే వారికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఆగ్రహంగా ఎప్పుడూ మాట్లాడలేదు. పైగా తన మూడు పెళ్లిళ్లపై కామెంట్లు చేసే వారిని స్టేఫినిలుగా పోల్చి వారి స్థాయిని మరోసారి గుర్తు చేశాడు. ఏతావాతా చెప్పొచ్చేది ఏంటంటే.. విలువైన వనరులు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధి లేక బేల చూపులు చూస్తోంది. కనీసం వెళ్లే దారి కూడా సరిగ్గా లేక ఒళ్ళు హూనమై కింద పడిపోతుంది. ఇలాంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ కు పవన్ కళ్యాణ్ అవసరం. కాదు కాదు అత్యవసరం! అయితేనే అన్నపూర్ణగా వినతికెక్కిన ఆంధ్రప్రదేశ్ బతికి బట్ట కడుతుంది. భవిష్యత్తు తరాలకు నీడనిస్తుంది. పవన్ కళ్యాణ్ కు రాజకీయాలే కావాలనుకుంటే ఎలాగైనా చేస్తాడు. ప్రజాసేవ చేయాలి అనుకుంటున్నాడు కాబట్టే జనం మధ్యలోకి వచ్చాడు. పదివేల మంది పోలీసులు నిలువరించినా ధైర్యంగానే ముందుకు వచ్చాడు. అదే తాడేపల్లి ప్యాలెస్ కు, నిండైన మనసుకు తేడా! బహుశా ఈ తేడాను ఏపీ ఓటర్లు గుర్తించారేమో.. తండోపతండాలుగా జనసేన కార్యాలయానికి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన రచయిత మాటలోనే చెప్పాలంటే.. ” సముద్రం ఒకడికి సలాం చేయదు. శిఖరం ఒకడికి తలవంచదు” ఇప్పుడు జనసేనాని కూడా అంతే. అర్థం చేసుకున్న వాళ్లకు అర్థం చేసుకున్నంత.