Chandrababu – Jagan: ఆంధ్ర ప్రదేశ్ లో దశాబ్దాలుగా రెండు పార్టీల చేతిలోనే అధికారం మారుతూ ఉంది..2014 వ సంవత్సరం వరుకు కాంగ్రెస్ మరియు టీడీపీ పార్టీల మధ్య అధికారం చేతులు మారుతూ వస్తుంటే..2014 నుండి టీడీపీ మరియు వైసీపీ పార్టీల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూ వస్తుంది..అధికారం ఉంటె మీ చేతుల్లో ఉండాలి..లేదా మా చేతుల్లో ఉండాలి..మూడవ పార్టీ కి అసలు అవకాశం ఇవ్వకూడదు అనేదే ఈ రెండు రాజకీయ పార్టీల ప్రధాన అజెండా.

2019 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని ఈ రెండు పార్టీలు ఎంత వ్యూహాత్మకంగా తొక్కాయో మన అందరం చూసాము..వైసీపీ పార్టీ చంద్ర బాబు – పవన్ కళ్యాణ్ పార్టనర్స్ అంటూ ప్రచారం చేస్తే..టీడీపీ పార్టీ అవును అతను మా పార్టనర్ అనే విధంగా తన మీడియా ని అస్త్రం గా చేసుకొని ప్రచారం చేసింది..ఇప్పుడు కూడా అదే పద్దతి ని ఫాలో అవుతున్నారు ఈ ఇరువురి పార్టీల అధినేతలు.
ఉదాహరణకి ఈరోజు జరిగిన సంఘటన ని తీసుకోవాలి..వైసీపీ పార్టీ వాళ్ళు మొదటి నుండి పవన్ కళ్యాణ్ ని ప్యాకేజి స్టార్, మరియు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ ఎల్లపుడు విమర్శిస్తూ వస్తున్న సందర్భాలు మన అందరం చూస్తూనే ఉన్నాము..ఈ విమర్శలు వినివిని విసుగెత్తిపోయిన పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళగిరి లో తన పార్టీ కార్యాలయం లో కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఇచ్చిన ప్రసంగం లో చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.
ఆయన మాట్లాడుతూ ‘వైసీపీ కొడుకులకు ఇదే చెప్తున్నాను..ఇంకోసారి నేను ప్యాకేజి తీసుకున్నాను అంటూ వాగితే చెప్పు తీసుకొని కొడతాను కొడకల్లారా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది..ఇది జనసేన పార్టీ కి మంచి మైలేజ్ ఇచ్చింది అనుకునేలోపు చంద్ర బాబు నాయుడు పనిగట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ ని కలవడానికి విజయవాడ కి వచ్చాడు..ఇది అడ్డం పెట్టుకొని వైసీపీ వాళ్ళు మళ్ళీ పవన్ కళ్యాణ్ ని ప్యాకేజి స్టార్ అంటూ పోస్టులు వెయ్యడం ప్రారంభించారు.

అలా వాళ్ళు రియాక్ట్ అవ్వాలనేదే చంద్ర బాబు నాయుడు వ్యూహం..లేకపోతే పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు కలవాల్సిన అవసరమే లేదు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నా మాట..పవన్ కళ్యాణ్ ని ఎదగనీయకుండా చెయ్యడమే చంద్ర బాబు లక్ష్యమని..2019 వ సంవత్సరం లో చేసినట్టే వైసీపీ -టీడీపీ పార్టీలు పవన్ కళ్యాణ్ ని ఇలాగే ప్రాజెక్ట్ చేసి జనాల్లో ఆయనకీ పెరుగుతున్న ఆధారణని తగ్గించే ప్రయత్నాలు చేస్తారని..దయచేసి పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ జనసేన పార్టీ సానుభూతి పరులు చెప్తున్నారు..మరి పవన్ కళ్యాణ్ వ్యూహం భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలి.