సంక్షేమం ఏపీని అప్పుల పాలు చేస్తోందా?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన ఎవరికి అర్థం కావడం లేదు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వ సొమ్మును ఇష్టారాజ్యంగా ఖర్చు పెడుతోందని ప్రతిపక్షాలు సైతం గగ్గోలు పెడుతున్నాయి. మరోవైపు అభివృద్ధి పనుల ఊసే లేదని వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టు రాష్ర్ట ఆర్థిక పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణనలోకి తీసుకుంది. ఇదే సందర్భంలో వైఎస్సార్ చేయూత పథకం కింద రాష్ర్ట ప్రభుత్వం నేడు వరుసగా రెండో ఏడాది23,14,342 మంది మహిళలకు రూ.4,339 కోట్ల ఆర్థికసాయాన్ని […]

Written By: Raghava Rao Gara, Updated On : June 22, 2021 7:25 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన ఎవరికి అర్థం కావడం లేదు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వ సొమ్మును ఇష్టారాజ్యంగా ఖర్చు పెడుతోందని ప్రతిపక్షాలు సైతం గగ్గోలు పెడుతున్నాయి. మరోవైపు అభివృద్ధి పనుల ఊసే లేదని వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టు రాష్ర్ట ఆర్థిక పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణనలోకి తీసుకుంది. ఇదే సందర్భంలో వైఎస్సార్ చేయూత పథకం కింద రాష్ర్ట ప్రభుత్వం నేడు వరుసగా రెండో ఏడాది23,14,342 మంది మహిళలకు రూ.4,339 కోట్ల ఆర్థికసాయాన్ని అందించనుంది.

2018, 2019లో ఉపాధి హామీ చట్టం కింద చేపట్టిన పలు పనులకు బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ చిత్తూరుకు చెందిన సీకే ఎర్రం రెడ్డి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస రావు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రభుత్వ సమాధానంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టుదేవానంద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్ట ఆర్థిక స్థితి దయనీయ పరిస్థితిలో ఉ:దన్న అభిప్రాయాన్ని న్యాయమూర్తి అన్నారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోతే పిటిషనర్లు పనులు చేయడానికి డబ్బులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు.

మూడు నాలుగేళ్ల క్రితం చేసిన పనులకు కేవలం రూ.21.41 లక్షలు, రూ.26.39 లక్షలు చొప్పున బిల్లులు చెల్లించడానికి డబ్బు లేదని వాదిస్తున్న ప్రభుత్వం సంక్షేమ పథకాలకు మాత్రం ఎక్కడి నుంచి తెస్తుందని ప్రశ్ణించింది. డీడీపీ హయాంలో చేసిన పనులకు తామెందుకు డబ్బు చెల్లించాలనే అభిప్రాయం జగన్ ప్రభుత్వంలో ఉంది. అందుకే గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించడానికి జగన్ ప్రభుత్వం ముందుకు రావడం లేదు.

రూ.50 లక్షల లోపు బిల్లులు చెల్లించడానికి డబ్బు లేదంటున్న జగన్ సర్కారు నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు రూ.18,750 చొప్పున ఆర్థికసాయం ఎలా అందిస్తోందని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు మాత్రమే నిధులు ఖర్చుచేస్తుందని విమర్శలున్నాయి.