Indira Park: తాను చేస్తే శృంగారం.. పక్క వాడు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా ఉంది టీఆర్ఎస్ పరిస్థితి. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్న సమయంలో ధర్నాలు, రాస్తారోకోలు చేసి ప్రభుత్వంపై విరుచుకుపడింది. కాలక్రమంలో అధికారంలోకి రావడంతో ధర్నా చౌక్ లను మూసేసింది. ఇందులో భాగంగా ఇందిరా చౌక్ ను కూడా రద్దు చేసి ధర్నాలు నిర్వహించొద్దని సూచించింది. దీనికోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. దీంతో ధర్నా చౌక్ స్థలం కాస్త మార్పు చేసింది.

ఉద్యమ సమయంలో ప్రజాస్వామ్య బద్ధంగా ధర్నాలు చేసిన అధికార పార్టీ తరువాత క్రమంలో ఎదురే లేకుండా చేయాలని భావించింది. ఇందు కోసం ధర్నా చౌక్ గా పేరుపొందిన ఇందిరా చౌక్ ను వాడుకుంది. కానీ అధికారంలోకి రాగానే దాని అవసరం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు దాన్ని వాడుకునే సమయం టీఆర్ఎస్ పార్టీకి ఆసన్నమైంది.
కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో భాగంగా ఈనెల 12న ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టే ఆందోళనకు ఇందిరా పార్క్ ను ఎన్నుకుని తాను చేసిన రద్దును పట్టించుకోకుండా స్పాట్ గా ఎన్నుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో అందరిలో అయోమయం నెలకొంది.
Also Read: Telangana: అన్నదాతను ఆగం చేస్తున్న ఆ రెండు పార్టీలు..
టీఆర్ఎస్ నిర్ణయంతో విమర్శలు వస్తూనే ఉన్నాయి. అధికారంలో ఉండి కూడా ధర్నాకు సిద్ధమవుతున్న తరుణంలో తాను చేసేందుకైతే సిద్ధమవుతూ ప్రతిపక్షాలు చేస్తే మాత్రం దాన్ని అడ్డుకోవడంతో ప్రభుత్వం తీరును విమర్శిస్తున్నారు. తనకో నీతి పక్కవాడికో నీతా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వం తీరు వివాదాస్పదమవుతోంది.
Also Read: Kaushik Reddy: కౌశిక్ రెడ్డి రాకతోనే టీఆర్ఎస్ కు నష్టం కలిగిందా?