corona in Telangana: కొవిడ్ మూడో దశ ఇక ముగిసినట్లే. ఈ సంకేతాలు అప్పుడే వెలువడుతున్నాయి. కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. దీంతో ప్రజలు కూడా భయాందోళన చెందడం లేదు. పాజిటివిటీ రేటు కూడా అదుపులోకి వచ్చింది. పాజిటివిటీ రేటు ఐదు శాతం నుంచి రెండు శాతానికన్నా తక్కువ నమోదు కావడం మంచిదే. దీంతో కరోనా ఆంక్షలు సడలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నా నిబంధనలు మాత్రం పాటించడం లేదు. ఇంటింటికి కొవిడ్ కిట్లు అందజేశారు. ఫీవర్ సర్వే కూడ చేపట్టారు.

మొదటి దశలో పది నెలలు, రెండో దశలో ఆరు నెలలు కానీ మూడో దశలో ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఇబ్బందులు పడ్డాం. దీంతో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. ఇకమూడో దశ ముప్పు తొలగినట్లే అని శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు. ఈ క్రమంలో కరోనా టీకాలు తీసుకోవడంతో వైరస్ తీవ్రత తగ్గిందని తెలుస్తోంది. దేశంలో మూడో దశ అత్యంత ప్రమాదకరకమని హెచ్చరికలు వచ్చినా దాని ప్రభావం మాత్రం తగ్గడం అందరిలో ఆనందాన్ని నింపుతోంది.
Also Read: సింగరేణి విషయంలో మరోమారు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య యుద్ధమే?
తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ ను సమర్థంగా ఎదుర్కొంటోంది. కొవిడ్ నిర్మూలనలో టీకా ప్రధాన భూమిక పోషించింది. ఫీవర్ సర్వే వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. దీంతోనే దేశంలో, రాష్ట్రంలో కొవిడ్ నిర్మూలన సాధ్యమైందని తెలుస్తోంది. దీనికి ప్రతి ఒక్కరి సహకారం ఉన్నట్లు మనకు తెలిసిందే. ఈ క్రమంలో కొవిడ్ మహమ్మారిని పూర్తిగా తుద ముట్టించేందుకు ఇంకా పనిచేయాల్సి ఉంది.
మూడో దశలో 2.8 శాతం మంది మాత్రమే ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పుడు తక్కువ మంది ఆస్పత్రులకు వెళుతున్నారు. టీకా తీసుకున్న వారికి వైరస్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. అందుకే ప్రజలందరు టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతోనే కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిందని తెలుస్తోంది. దీంతో వైరస్ పూర్తిగా కనుమరుగయ్యేందుకు ఇంకా సమయం పడుతుందని తెలుస్తోంది.
Also Read: కేసీఆర్ పై రాజద్రోహం కేసు పెట్టేందుకు బీజేపీ రెడీ
[…] Also Read: తెలంగాణలో మూడో దశ ముగిసినట్లేనా? […]
[…] Also Read: తెలంగాణలో మూడో దశ ముగిసినట్లేనా? […]
[…] Also Read: తెలంగాణలో మూడో దశ ముగిసినట్లేనా? […]