AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గుతోంది. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన తొలగిపోతోంది. క్రమంగా జనం రోడ్లపైకి వస్తున్నారు. తమ పనులు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గత కొద్ది రోజులుగా థర్డ్ వేవ్ ప్రభావంతో ప్రజలు భయపడినా ప్రస్తుతం క్రమంగా భయాలు తొలగిపోతున్నాయి. కేసుల సంఖ్య అదుపులోకి రావడంతో ప్రజలు యథేచ్ఛగా తిరుగుతున్నారు.
వారం క్రితం 15 వేలకు చేరుకున్నకేసులు క్రమంగా దిగొస్తున్నాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ప్రజలు జంకడం లేదు. క్రమంగా తమ పనులు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఫిబ్రవరి 20 వరకు కరోనా మూడో దశ ముగుస్తుందని తెలుస్తోంది. దీంతోనే ప్రజల్లో భయం క్రమంగా పోతోంది. ఇప్పటికే కేసులు దిగి రావడంతో ప్రజలు నిబంధనలు పాటించడం లేదు.
Also Read: ముద్రగడ కాపులకు అవసరం లేదా?
దేశంలో చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు మూసివేసినా ఏపీలో మాత్రం యథాతథంగా కొనసాగించింది. నిబంధనలు కూడా పాటించలేదు. కేసులు పెరిగినా ఏ మాత్రం భయపడకుండానే ముందుకు సాగింది. కానీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే అంశమే. గడిచిన 24 గంటల్లో 1597 కేసులు నమోదయ్యాయి. 8 మంది మరణించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గడం మంచిదే. టీకాలుతీసుకోవడంతోనే మనం వైరస్ ను జయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది టీకాలు తీసుకుని కరోనాను పారదోలేందుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో కరోనా ప్రభావం రాష్ట్రంలో మెల్లగా శాంతిస్తోంది. ప్రజలకు విశ్వాసం పెరుగుతోంది. ఏపీలో పరిస్థితి దారి వచ్చినట్లు తెలుస్తోంది. కేసుల సంఖ్య తగ్గుతూ పాజిటివిటీరేటు కూడా క్రమంగా అదుపులోకి వస్తోంది.
Also Read: ప్రభుత్వ భూముల తాకట్టు.. అప్పులు రాబట్టు