
Ponguleti Srinivasa Reddy : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) రాష్ట్రంలో మళ్లీ హల్‌చెల్ చేయబోతోంది. ఇదేంటి టీఆర్‌ఎస్‌ను కేసీఆర్ ఇప్పటికే బీఆర్‌ఎస్‌గా మార్చే శారు కదా అనుకుంటున్నారు. మీరనుకుంటున్నది నిజమే.. మేం చెప్పేది కూడా నిజమే. తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ రాజకీయాలోకి రీఎంట్రీ ఇచ్చి, తనను కాదన్న బీఆర్‌ఎస్(పాత టీఆర్‌ఎస్)కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్నారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
‘పొంగులేటి’ భారీ స్కెచ్
ఖమ్మం మాజీ ఎంపీ పొగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బీఆర్‌ఎస్ కొంతకాలంగా దూరం పెడుతోంది. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. పొంగులేటి వర్గాని‍్న కూడా పట్టించుకోవడం లేదు. దీంతో పారీ‍్టలో ఉంటూ పొంగులేటి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తన అనుచరును సస్పెండ్ చేయడం పిరికిపంద చర్య అని దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని కేసీఆర్, కేటీఆర్‌కు సవాల్ చేశారు. కానీ బీఆర్‌ఎస్ అధిష్టానం చర్యలకు ఎందుకో వెనుకాడుతోంది.
బీజేపీ, కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం..
ఇదిలా ఉంటే పొంగులేటి బీఆర్‌ఎస్‌ను వీడతారని, బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. జనవరి 19న అమిత్‌షాను కలుస్తారని కూడా బీజేపీ నాయకులు ప్రకటించారు. కానీ అది జరుగలేదు. అయితే బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు మాత్రం ఆ పార్టీ నేతలు తెలిపారు. తర్వాత కొన్ని రోజులకు కాంగ్రెస్ నేతలు కూడా శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కానీ పొంగులేటి ఎటూ తేల్చలేదు. తర్వాత కొన్ని రోజులకు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్.షర్మిలను కలిశారు. దీంతో వైఎస్సార్‌టీపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఆయన మాత్రం ఏ పార్టీలో చేరేది స్పష్టతనివ్వలేదు.
వరుస సమ్మేళనాలు.. అభ్యర్థుల ప్రకటన..
2023 జనవరి నుంచి ఆయన బీఆర్ఎస్ రెబల్‌గా మారిన పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు, నాయకుల నుంచి మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెంట నడిచే బీఆర్ఎస్ నేతలపై గులాబీ పార్టీ వేటు వేసింది. దీంతో బీఆర్‌ఎస్‌పై పొంగులేటి విమర్శల దాడి పెంచారు. పినపాకలో మొదలైన విమర్శలు నేటికీ సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన మరో అడుగు ముందుకేసి పినపాక, వైరా, ఇల్లందు, అశ్వరావుపేట, మధిర నియోజకవర్గాలకు తన అభ్యర్థులను ప్రకటించారు. జిల్లాలోని పలు మండలాల్లో పొంగులేటి శ్రీనన్న పేరుతో కార్యాలయాలను సైతం ఓపెన్ చేశారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరకముందే ఆయన తన అభ్యర్థులను ప్రకటించడం చర్చకు దారి తీసింది.
ఊహించని రీతిలో కొత్త పార్టీ.. !
బీఆర్‌ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున‍్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తాజాగా భారీ షాక్ ఇవ్వబొతున్నారు. ఇంతకాలం ప్రస్తుతం ఉన్న పార్టీల్లో చేరుతారని ప్రచారం జరిగినప్పటికీ తాజాగా ఆయన సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆ పార్టీ కూడా బీఆర్ఎస్‌కు భారీ షాక్ ఇచ్చేలా తెలంగాణ రైతు సమితి(టీఆర్ఎస్) పేరు ఖరారు చేసినట్లు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్ అంటే ఓ బ్రాండ్. ఆ పేరుతో ఆయన తనవర్గాన్ని గెలిపించుకొని అసెంబ్లీలో చక్రం తిప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన పార్టీ పేరు కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు పొంగులేటి అనుచరులు చెబుతున్నారు.
టీఆర్ఎస్ అనే బ్రాండ్‌తోనే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను కొట్టాలని పొంగులేటి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన తెలంగాణ రైతు సమితి పేరుతో పార్టీ పెట్టాలని నిర్ణయించినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌తో అధికార పార్టీ గెలుపుకు ఈజీగా బ్రేక్ వేయవచ్చని శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నటు‍్ల సమాచారం.