AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇన్నాళ్లు 13 జిల్లాలుగా ఉన్న రాష్ర్టం 26 జిల్లాలుగా మారనుంది. దీంతో దీనికి సంబంధించిన ప్రక్షాళన షురూ అయింది. పెద్ద జిల్లా తూర్పు గోదావరి కాస్త చిన్నగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇన్నేళ్లు రాష్ర్టంలోనే పెద్ద జిల్లాగా తూర్పు గోదావరికి గుర్తింపు ఉండేది. కానీ ప్రస్తుతం జిల్లాల ఏర్పాటులో తూర్పు గోదావరి మూడు జిల్లాలుగా మారనుంది. దీంతో దాని ఉనికి ప్రశ్నార్థకం కానుంది.

ఇప్పటివరకు పెద్ద జిల్లాలుగా పరిగణింపబడిన ఉభయ గోదావరి జిల్లాలు ఐదు జిల్లాలుగా మారనున్నాయి. తూర్పు గోదావరి మూడు పశ్చిమ గోదావరి రెండు జిల్లాలుగా మారనున్నట్లు తెలుస్తోంది. దీంతో పెద్ద జిల్లాలుగా పిలిచిన జిల్లాలు నేడు చిన్నబోనున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించింది. దీంతో జిల్లాల పునర్యవస్థీకరణ అంశం శరవేగంగా ముందుకు సాగనుందని తెలుస్తోంది.
19 నియోజకవర్గాలున్న తూర్పు గోదావరి జిల్లాలో మూడు పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. దీంతో దీన్ని మూడు జిల్లాలుగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అమలాపురం ను కోనసీమ జిల్లాగా నామకరణం చేసేందుకు సంకల్పించింది. రాజోలు, కొత్తపేట, రామచంద్రాపురం, ముమ్మడివరం, మండపేట, అమలాపురం, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి.
కాకినాడ కేంద్రంగా తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, జగ్గంపేట, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాజమండ్రి కేంద్రంగా రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి, రాజాగనరం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలున్నాయి.
ఇప్పటివరకు పెద్ద జిల్లాలుగా ఉన్న ఉభయగోదావరి జిల్లాల స్వరూపం మారబోతోంది. ఇక్కడ ఎక్కువ స్థానాలు వస్తే చాలు రాష్ర్టంలో పాగా వేయొచ్చనే రాజకీయ పార్టీల ఎత్తుగడలు ఇక సాగవని తెలుస్తోంది. ఎందుకంటే ఈ జిల్లాల ఉనికి మొత్తం మారబోతోంది. ఐదు జిల్లాలుగా మారడంతో చిన్న జిల్లాలుగా ఏర్పాటు కానున్నాయి. దీంతో రాజకీయ స్వరూపమే మారిపోనుంది.
Also Read: కొత్త జిల్లాలకు ఈ పేర్లు.. అప్పుడే డిమాండ్లు మొదలయ్యాయే!
రాజకీయ ప్రోద్బలం ఉన్న జిల్లాలుగా గుర్తింపు పొందిన ఉభయ గోదావరి జిల్లాలు కొత్త జిల్లాల ఏర్పాటుతో వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ర్టంలో చాలా ప్రాంతాల స్వరూపం మారిపోనుంది. ఇప్పటికే తెలంగాణ కొత్త జిల్లాలుగా ఏర్పడినందున ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నూతన జిల్లాల కసరత్తు ప్రక్రియ ఊపందుకోనుంది.
కోనసీమ జిల్లాలుగా పేరు గాంచిన ఉభయ గోదావరి జిల్లాల భౌగోళిక స్వరూపం మాయం కానుంది. ఏపీకే వన్నె తెచ్చిన కోనసీమ జిల్లాల ప్రస్థానం ప్రశ్నార్థకం కానుంది. రాజకీయాలకే కొత్త అర్థం తెచ్చిన జిల్లాలు నేడు ఐదు జిల్లాలుగా విభజించనుంది.
Also Read: AP New 26 Districts: 26 కొత్త జిల్లాల ప్రతిపాదనల్లో ఆసక్తికర విషయాలు