AP Employees: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. తమన్యాయమైన డిమాండ్లు తీర్చాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్లనున్నాయి. దీంతో ప్రభుత్వం వారిని వారించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. సమ్మెతో ఇబ్బందులు పడతారని చెబుతోంది. సామరస్యంగా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుందామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఉద్యోగులు మాత్రం ససేమిరా అంటున్నారు. సమ్మె చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. ఉద్యోగులతో చర్చించాలని సూచించింది. కానీ ఉద్యోగులు మాత్రం ఎవరి మాట వినడం లేదు. పీఆర్సీ ప్రకటనతో మొదలైన లొల్లి ఇంకా చల్లారడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో పనులు మందగిస్తున్నాయి. పరిపాలన సాగడం లేదు. ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో ప్రభుత్వం మరోమారు ఉద్యోగులకు అవకాశం కల్పిస్తోంది. అవసరమైతే ఎస్మా ప్రయోగానికి కూడా వెనకాడేది లేదని చెబుతోంది. దీనిపై ఉద్యోగులే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

అత్యవసర సేవలకు విఘాతం కలిగితే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించుకోవచ్చనే నిబంధనలు ప్రభుత్వానికి వరంగా మారుతున్నాయి. మరోవైపు ఆర్టీసీ, విద్యుత్ రంగాల ఉద్యోగులు సమ్మె చేయకూడదనే నిబంధనలు ఉండటంతో సర్కారుకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. దీంతో ఆరోగ్య, ఆర్టీసీ ఉద్యోగులు అందరిని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమ్మెకు కలిసి రావాలని కోరుతున్నారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసం సమ్మె చేస్తేనే సమస్యలు తీరుతాయని భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై పోరాటానికే సిద్ధపడుతున్నారు. కానీ ప్రభుత్వం నిక్చచ్చిగా చర్యలు చేపడితే ఉద్యోగుల భవిష్యత్ అంధకారమయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ వారు మాత్రం వినడం లేదు.

Also Read: AP Employees: కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల జీతాలు ఎలా తగ్గుతాయి..? ఆ వివరాలేంటి..?
ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేసినా ఉద్యోగులు మాత్రం వారితో సమావేశం కావడం లేదు. తమ ముఖ్యమైన మూడు డిమాండ్లు నెరవేర్చితేనే చర్చలకు వస్తామని తెగేసి చెబుతున్నారు. దీంతో పీటముడి పడిపోతోంది. ఇటు ప్రభుత్వం అటు ఉద్యోగులు పట్టు వీడటం లేదు. ఫలితంగా సమ్మె చేసేందుకు ఇంకా ఉద్యోగుల సంఘాల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సమ్మె ప్రభావం ఎందాక వెళుతుందో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ప్రభుత్వంతో చర్చలు జరిపి శాంతియుత పరిష్కారం చేసుకోవాలని చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదు.
కొవిడ్ ప్రభావం కూడా ఎక్కువైపోతున్న సమయంలో ఉద్యోగులు ఇలా ప్రవర్తించడం సరికాదని ప్రభుత్వం చెబుతోంది. ప్రజల అవసరాల కోసం పని చేయాల్సిన ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మె చేస్తే దాని ప్రభావం అందరిపై పడుతుంది. దీంతో ఉద్యోగుల తీరుపైనే విమర్శలు వస్తాయి. కానీ అదిఆలోచించడం లేదు. తమ డిమాండ్లు నెరవేర్చాలనే పట్టుపడుతున్నారు. ఎలాగైనా ప్రభుత్వంతో పనిచేయించుకోవాలనే చూస్తున్నారు. ఈక్రమంలో సమ్మె ఎటు వైపు దారి తీస్తుందో? ఎవరిపై ప్రభావం చూపిస్తుందో వేచి చూడాల్సిందే.
Also Read: AP Employees Strike: పట్టుదలకు పోతే ఉద్యోగుల పని ఖతమేనా?
[…] […]