KCR: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ గణతంత్ర దినోత్సవం రోజున పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. పింక్ పార్టీ జిల్లా అధ్యక్షులను ప్రకటించేశాడు. అలా జిల్లా అధ్యక్షులను నియమించిన క్రమంలోనే పార్టీ కోసం క్షేత్రస్థాయిలో ఇంకా బలంగా కృషి చేయాలని నేతలకు సూచిస్తున్నారు. అయితే, రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇలా ఎమ్మెల్యేను జిల్లా అధ్యక్షులుగా నియమించిన నిర్ణయంతో కేసీఆర్‌కు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని కొందరు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలోని 33 జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. అందులో 20 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు మహిళా నేతలు ఉన్నారు. మిగతా వారిలో కొదరు కార్పొరేషన్ పదవుల్లో ఉండగా, ఇంకొందరు జెడ్పీ, మున్సిపల్ పదవుల్లో ఉన్నారు. ఇందులో బంగారు తెలంగాణ, ఉద్యమ తెలంగాణ నేతలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనబడుతున్నది. అయితే, ఈ జిల్లా అధ్యక్షుల జాబితాపై సీనియర్లు అసంతృప్తితో ఉన్నారనే తెలుస్తోంది.
జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే మరో నియోజకవర్గ ఎమ్మెల్యేను ఎలా నిర్దేశించగలడని అనుమానిస్తున్నారు. జిల్లాలో ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులనే అధ్యక్షులుగా నియమించారా? అనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: CM KCR: ఎన్నికలకు పక్కా వ్యూహం.. జిల్లాలకు కొత్త బాసులు.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్..
ఇకపోతే ఈ నూతన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీని ఇంకా బలోపేతం చేసేందుకుగాను తమ వంతు ప్రయత్నం చేస్తారనే అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నూతన జిల్లా అధ్యక్షులు.. ఎన్నికలలో గులాబీ జెండాను ఏ మేరకు విజయ తీరానికి చేర్చగలరు అనేది తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే. అయితే, పార్టీలో ఉన్న సీనియర్ నేతలను కాదని ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్షుల పదవిని కట్టబెట్టడంపైన పార్టీలోనూ చర్చ జరుగుతున్నదని సమాచారం.
పార్టీలో పని చేసే వాళ్లకు కూడా ఆర్థికంగా బలంగా ఉన్న వారికి పదవులు ఇచ్చారని కొందరు ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పార్టీకి జిల్లా అధ్యక్షులను నియమించడం ద్వారా పార్టీ పురోగమనంలోకి కాకుండా తిరోగమనంలోకి అవకాశాలున్నాయని కొందరు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం ఆయనకు తెలిసే ఉండొచ్చని, ఆయన ఈ మేరకు అంచనాలు వేసుకుని ఉండొచ్చని, అయినప్పటికీ ప్రయోగం లాగా ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉంటారని కొందరు అంటున్నారు.
Also Read: KCR Gajwel : గజ్వేల్ లో పోటీచేయవద్దని కేసీఆర్ డిసైడ్ అయ్యాడా? అందుకే భయపడుతున్నాడా?
[…] Bhala Tandanana: వైవిధ్యభరిత కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. శ్రీ విష్ణు హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘భళా తందనాన’. కాగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశాడు. ఈ టీజర్ బాగా ఆకట్టుకుంటోంది. […]
[…] Tollywood Crazy Updates: టాలీవుడ్ ప్రజెంట్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో గతంలో మహేశ్ బాబు ‘జనగణమన’ అనే సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. కానీ సినిమా సెట్ కాలేదు. ఆ తర్వాత కూడా పూరి మహేష్ తో సినిమా చేయడానికి ప్రయత్నించాడు, కానీ కుదరలేదు. ఇప్పుడు అదే కథతో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. అయితే లైగర్ రిజల్ట్ పైనే నెక్ట్స్ ప్రాజెక్ట్ ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పూరి గత సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా హీరో విజయ్ దేవరకొండ బాక్సర్ గా ఆయన ‘లైగర్’ను రూపొందిస్తున్నాడు. […]
[…] Shweta Tiwari: ఈ రోజు ట్రెండింగ్ విషయానికి వస్తే.. యంగ్ హీరోయిన్ శ్వేతా తివారి, మధ్యప్రదేశ్ కి చెందిన నటి ఈమె. అయితే, బోల్డ్ గా ఉండే శ్వేతా తివారి షాకింగ్ కామెంట్స్ చేసింది. పైగా కామెంట్స్ చేసింది దేవుడి పైన. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భోపాల్ లో మీడియా సమావేశంలో శ్వేతా తివారి పాల్గొని మాట్లాడింది. […]
[…] Also Read: కేసీఆర్ తీసుకున్న ఆ నిర్ణయం కరెక్ట్… […]