Homeఆంధ్రప్రదేశ్‌Formation Of New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు ఆలస్యమేనా? .. మరో నోటిఫికేషన్ కు...

Formation Of New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు ఆలస్యమేనా? .. మరో నోటిఫికేషన్ కు సర్కారు నిర్ణయం

Formation Of New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని స్టేట్లకు లేఖ పంపింది. దీని ప్రకారం జూన్ 20లో గా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముగిస్తే సరి లేదంటే ఇంకా కొంత కాలం ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పటి నుంచి జనగణన ప్రక్రియ మొదలు పెట్టనునన్నట్లు తెలుస్తోంది.అందుకే ఏపీకి ఈ మేరకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ ముందు పెద్ద సవాలు మిగిలి ఉంది.

Formation Of New Districts
Formation Of New Districts

మొదటి నోటిఫికేషన్ విడుదల చేసినా చాలా ప్రాంతాల్లో అభ్యంతరాలే ఎక్కువగా వస్తున్నాయి. కడపలో రాజంపేటకు బదులుగా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడంపై అభ్యంతరాలు వచ్చాయి. అలాగే చిత్తూరు జిల్లాలో మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయకపోవడంపై కూడా అభ్యంతరాలు ఎక్కువయ్యాయి. విశాఖపట్నంలో శృంగవరకోటను విజయనగరంలో కలపడం వంటి వాటిపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉండటంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

Also Read: AP Govt Decision On New Districts: కొత్త జిల్లాలతో రాబోయే ఎన్నికలపై ఎఫెక్ట్.. మారిన మౌలిక స్వరూపం..!

ఇప్పటికే 13 జిల్లాలుగా ఉన్న స్టేట్ ను మరో 13 జిల్లాలతో కలిపి 26 జిల్లాలుగా ఏర్పాటు చేయనుంది. ఇందులో కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లకు కూడా ఓకే చెప్పింది. కానీ ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాల మేరకు మరో నోటిఫికేషన్ కోసం ఆగాల్సి ఉంటుంది. దీంతో నూతన జిల్లాల ఏర్పాటులో ఇంకా సమయం తీసుకోవాల్సి ఉంటుంది. సొంత పార్టీ నేతల నుంచి ఎక్కువగా డిమాండ్లు వస్తున్నాయి. దీంతోనే ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

నోటిఫికేషన్ విడుదల చేశాక 30 రోజుల సమయం ఇచ్చి అభ్యంతరాలు ఉంటే చెప్పాలని వైసీపీ ప్రభుత్వం సూచించింది. దీంతో ఎక్కువగా వైసీపీ నేతల నుంచే అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటులో ఎలాంటి విమర్శలకు తావివ్వవద్దని భావిస్తోంది. దీంతో పనుల్లో ఆలస్యమైనా మంచి నిర్ణయం ఉండాలని చూస్తోంది. ఇందుకు గాను అన్ని ప్రయత్నాలు ప్రారంభించింది.

Also Read: AP New Districts: కొత్త జిల్లాలతో ఏపీ సర్కారుకు త‌ల‌నొప్పులు.. అలా జ‌రిగితే తెలంగాణ లాగే ఇబ్బందులు?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

4 COMMENTS

  1. […] Sarkaru Vari Pata: ‘సర్కారు వారి పాట’ నుంచి లవ్ సాంగ్ రాబోతుందట. సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ‘సర్కారు వారి పాట’ నుంచి త్వరలో అప్‌ డేట్ రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి ఈ సినిమా అప్‌ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ లవ్ సాంగ్ అట. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular