https://oktelugu.com/

త్రిశంకు స్వర్గంలో ‘పోలవరం’.. ప్రాజెక్టు పూర్తయ్యేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తామంటే తామే నిర్మిస్తామని చెప్పి, ఎవరూ పట్టించుకోకపోవడంతో మొత్తానికి ప్రాజెక్టు పూర్తయ్యేనా..? అనే సందేహం కలుగుతోంది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన ఏపీ రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చాకచక్యంగా ఈ ప్రాజక్టు నిర్మాణం ఆలస్యానికి కారణం కేంద్రం, టీడీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించాల్సి ఉండగా.. 2014లో తాము […]

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2020 / 08:58 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తామంటే తామే నిర్మిస్తామని చెప్పి, ఎవరూ పట్టించుకోకపోవడంతో మొత్తానికి ప్రాజెక్టు పూర్తయ్యేనా..? అనే సందేహం కలుగుతోంది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన ఏపీ రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చాకచక్యంగా ఈ ప్రాజక్టు నిర్మాణం ఆలస్యానికి కారణం కేంద్రం, టీడీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించాల్సి ఉండగా.. 2014లో తాము నిర్మిస్తానని చెప్పి నిధుల విషయంలో గందరగోళం సృష్టించిందన్నారు. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టును కేంద్రం పట్టించుకోకపోవడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి దాపురించిందన్నారు.

    Also Read: వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తరువాత విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును పూర్తిగా తామే నిర్మిస్తామని పునరావాసం, భూసేకరణ ఖర్చు కేంద్రానిదేనని పేర్కొన్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. కేంద్రం చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టును 2014లో రాష్ట్రం బాధ్యత తీసుకుందన్నారు. కానీ 2014 ముందు ఖర్చులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని టీడీపీ డిమాండ్‌ చేసిందన్నారు.

    టీడీపీ హయాంలో చివరి ఏడాది పోలవరానికి రూ.55.548 కోట్లకు ఆమోదం లభించిందని, అయితే కేంద్ర భ్రుత్వం మాత్రం 2014 నాటి ధరలను మాత్రమే లెక్కిస్తామని చెప్పి షాక్‌ ఇచ్చిందన్నారు.

    Also Read: జగన్ తనదైన రీతిలో మర్యాద చేస్తున్నాడట!

    అంతేకాకుండా పోలవరంపై పెట్టిన ఖర్చు రూ. 2,234 కోట్లు రీఎంబర్స్‌మెంట్‌ చేస్తున్నామమని పార్లమెంట్‌లో కేంద్రమంత్రులు చెప్పారన్నారు. కానీ ప్రస్తుతం తగ్గించిన అంచనాలు ఆమోదించాలని, లేకపోతే అవి కూడా ఇవ్వలేమని మెలిక పెట్టే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించారని బుగ్గన ఆరోపించారు. దీంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోవడానికి టీడీపీ హయంలో చేసిన, ప్రస్తుతం చేస్తున్న కుట్రలేనన్నారు. పోలవరం కాంట్రాక్టులపైనే టీడీపీ దృష్టి పెట్టిందని ఇతర విషయాలను పట్టించుకోవడం లేదన్నారు.