Chandrababu-Pawan Kalyan: బలమైన వైసీపీని ఢీకొట్టాలంటే చంద్రబాబు బలం సరిపోదని ఆయన ఏడుపుతో అర్థమైంది. ఎన్టీఆర్ నుంచి వైఎస్ఆర్ దాకా అందరినీ ఏడిపించేసి ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన చంద్రబాబు గారు.. ఇప్పుడు జగన్ ధాటికి వలవలా ఏడ్చిన తీరు చూసి ఆయన ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబు 2024 ఎన్నికలను టార్గెట్ చేసుకొని ఒంటరిగా కంటే జనసేనతో కలిసి వెళ్లడమే బెటర్ అని డిసైడ్ అయ్యినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీచేస్తే గెలవడం కష్టమని చంద్రబాబు ఓ అంచనాకు వచ్చినట్టు భోగట్టా..
pawan-kalyan-chandra-babu
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఒంటరిగా పోటీచేసే అవకాశాలు మచ్చుకైనా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన, వామపక్షాలతో కలిసి వెళ్లడం బెటర్ అని చంద్రబాబు భావిస్తున్నాడట.. బీజేపీని కూడా ఆహ్వానించాలని.. ఆ పార్టీ వచ్చినా రాకపోయినా జనసేన చేయి మాత్రం వదలవద్దని చంద్రబాబు డిసైడ్ అయ్యారట..
అయితే 2014లో భేషరతుగా మద్దతు పలికిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ఇప్పుడు అలా ఇచ్చే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ తో టీడీపీ పొత్తుకు చాలా అడ్డంకులున్నాయి. పొత్తు వల్ల లాభం కంటే నష్టమే టీడీపీకి ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒక నిలకడ లేదు అన్నది వాస్తవం. అప్పుడే ఫైర్ అవుతారు.. పోరాటం చేస్తారు. వీధికెక్కుతారు. అనంతరం నెలరోజుల పాటు సైలెంట్ అవుతారు. ఇక రాజకీయంగా టీడీపీ, బీజేపీలతో విభేదించి వెళ్లారు. జెండాలు మార్చేశారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ పంచన చేరారు. అభిమానులు కోట్లలో ఉన్నా.. ఆ ఓటును సమీకరించకపోవడం పవన్ కు మైనస్.
యువత ఓట్లు రాబట్టుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు సైతం పవన్ పై ఆశలు పెంచుకున్నారు. కాపు సామాజికవర్గం ఓట్లు పవన్ తో వస్తాయని ఆశ పెంచుకున్నాడు. అయితే కాపులంతా టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకుంటే ఆయన వెంట నడుస్తారా? లేదా? అన్నది ఇక్కడ ప్రశ్న.
Also Read: సెంటిమెంట్ కంటిన్యూ: అసభ్య వ్యాఖ్యలపై చంద్రబాబు భార్య స్పందన
కాపులు గంపగుత్తగా జనసేనాని పవన్ కు ఓటు వేసే పరిస్థితి లేదు. కాపులు అత్యధికంగా ఉన్న రెండు చోట్ల పోటీచేసినా పవన్ గెలవలేకపోయారు. స్థానిక అభ్యర్థులు, పరిస్థితులను బట్టి కాపులు మారుతున్నారు. ఇక కాపు ఉద్యమ నేత ముద్రగడ తాజాగా చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన లాంటి వారు పవన్ కు, టీడీపీకి ఓటేసే పరిస్థితి లేదు. బీసీలు ప్రస్తుతం వైసీపీ వెంట ఉన్నారు. బీసీలను పవన్ ఆకర్షిస్తాడా? అది సాధ్యమా? అన్నది ఇక్కడ ప్రశ్న..
ఇక బీసీలు చాలామంది అనాదిగా టీడీపీకి సపోర్టుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కనుక పొత్తు పెట్టుకుంటే కాపులతో విభేదించే బీసీలు కొందరు టీడీపీకి దూరం అవుతారు. ఇలా చాలా సమీకరణాలు టీడీపీతో జనసేన పొత్తుకు ఆటంకంగా మారుతున్నాయంటున్నారు. కొన్ని ప్లస్ అవుతున్నాయి. మరికొన్ని మైనస్ అవుతున్నాయి. ఈ కూటమికి వ్యతిరేకులను ఆకర్షించడంలో వైసీపీ పెద్ద ఎత్తున పనిచేస్తోంది. ఇలా చంద్రబాబు, పవన్ కలిసినా కూడా జనాలు పూర్తిగా మారితే తప్ప.. జగన్ పై వ్యతిరేకత చూపితే తప్ప.. వారికి అధికారం దక్కడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.
Also Read: చంద్రబాబుకు ‘రూట్’ దొరికింది..! వ్యూహంలో మార్పు.. ఇక ప్లాన్ బి