https://oktelugu.com/

Chandrababu: ఈసారి టికెట్ల కేటాయింపు చంద్రబాబు చేతుల్లో లేదట?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. పార్టీని నడిపించే సత్తా ఉన్నా సరైన నేతలు కరువయ్యారు. దీంతో ఎవరికి టికెట్లు ఇవ్వాలో ఎవరని గెలిపించుకోవాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. పార్టీని విజయపథంలో నడిపించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇన్నాళ్లు జవసత్వాలు లేకుండా పడి ఉన్న పార్టీని మళ్లీ జోష్ నింపాలంటే కొత్తరక్తమే కావాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే పాత తరం వారికి టాటా చెప్పేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లుగా పాత తరం వారినే పట్టుకుని […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 21, 2021 / 10:38 AM IST
    Follow us on

    Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. పార్టీని నడిపించే సత్తా ఉన్నా సరైన నేతలు కరువయ్యారు. దీంతో ఎవరికి టికెట్లు ఇవ్వాలో ఎవరని గెలిపించుకోవాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. పార్టీని విజయపథంలో నడిపించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇన్నాళ్లు జవసత్వాలు లేకుండా పడి ఉన్న పార్టీని మళ్లీ జోష్ నింపాలంటే కొత్తరక్తమే కావాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే పాత తరం వారికి టాటా చెప్పేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లుగా పాత తరం వారినే పట్టుకుని వేలాడుతుంటే పార్టీ భవితవ్యం అంధకారంలో పడుతోంది.

    Chandrababu

    ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో చంద్రబాబే తుది నిర్ణేత కావడంతో టికెట్ల కేటాయింపులో ఎక్కడ కూడా అభిప్రాయభేదాలు రాలేదు. కానీ ఈ సారి మాత్రం చంద్రబాబు చేతుల్లో ఏం లేదని తెలుస్తోంది. పార్టీ భవిష్యత్ దృష్ట్యా గెలుపు గుర్రాల కోసం సర్వే చేయిస్తున్నారని సమాచారం. మూడేళ్లకు మూడు సర్వేలు నిర్వహించి అందులో ఎవరికి విజయావకాశాలు ఉంటే వారినే ఎంపిక చేస్తారనే ప్రచారం సాగుతోంది.

    దీని కోసం ఇప్పటికే పలు సర్వే సంస్థలు పనులు ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ టికెట్ల కేటాయింపు వ్యవహారం మలుపులు తిరగనుందని తెలుస్తోంది. మూడు దశాబ్దాల పాటు చక్రం తిప్పిన బాబు ప్రస్తుతం సర్వేలను పూర్తిగా నమ్ముకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీ బలోపేతం అయ్యే దిశగా బాబు ఇంకా ఏ మార్పులు చేపడతారో తెలియడం లేదు.

    Also Read: Dowry Crime: కట్నం డబ్బులతో పరారైన వరుడు… ఆందోళనకు దిగిన వధువు.. చివరికి ఇలా!

    ప్రాంతీయ పార్టీలకు అధినేతలే బాస్ లు కావడంతో వారు చెప్పిందే వేదంలా భావిస్తుంటారు. కానీ అధికారం దూరం కావడంతో అధినేత కూడా ఆలోచనలో పడ్డారు. ఎలాగైనా ఈసారి అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకోసం అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సర్వేలతో అభ్యర్థుల భవితవ్యం తేల్చే పనిలో పడ్డారు.

    Also Read: Money Wrong Transaction: పొరపాటున డబ్బులు వేరే అకౌంట్ కి పంపించారా.. వెంటనే ఇలా చేయండి?

    Tags