Shyam Singha Roy: విజయాలపరంగా హీరో నాని వెనుకబడ్డారు. ఇటీవల కాలంలో ఆయన నటించిన ఒక్క సినిమా కూడా కమర్షియల్ సక్సెస్ కాలేదు. గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీశ్ భారీ అంచనాల మధ్య విడుదలై ఉసూరుమనిపించాయి. జెర్సీ సినిమా మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా నానికి నటుడిగా చాలా పేరు తెచ్చిపెట్టింది. అయితే కమర్షియల్ గా జెర్సీ కూడా విజయం అందుకోలేదు. దీనితో నాని ఓ సాలిడ్ హిట్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దాని కోసమే ఆయన శ్యామ్ సింగరాయ్ లాంటి ప్రయోగాత్మక చిత్రం ఎంచుకున్నారు.
నాని ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడం మరొక సాహసం. మేకర్స్ సైతం నానిపై, శ్యామ్ సింగరాయ్ కథపై నమ్మకముంచి భారీగా ఖర్చు పెట్టారు. ఈనెల 24న శ్యామ్ సింగ రాయ్ ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇక శ్యామ్ సింగరాయ్ రెండు భిన్న కాలాలలో సాగే చిత్రమని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నాని ప్రస్తుత కాలంలో సినిమా డైరెక్టర్ గా, పీరియడ్ రోల్ లో సోషల్ యాక్టివిస్ట్ అయిన శ్యామ్ సింగరాయ్ లా కనిపిస్తున్నారు.
దీంతో శ్యామ్ సింగ రాయ్ పునర్జన్మల కథని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ప్రేక్షకుల అంచనాలు తప్పని తెలుస్తుంది. శ్యామ్ సింగరాయ్ స్టోరీ లీక్ కాగా… ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఈ మూవీ రజినీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ చంద్రముఖి కథను పోలి ఉంది. స్టార్ డైరెక్టర్ కావాలనుకున్న నాని ఓ మంచి పీరియాడిక్ స్టోరీ కోసం వెతుకుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అతడికి బెంగాల్ కి చెందిన శ్యామ్ సింగరాయ్ అనే యాక్టివిస్ట్ గురించి తెలుస్తుంది.
Also Read: Hero Nani: ‘సింహంలా ఉన్నావ్ నాన్న’ అంటూ నానికి కొడుకు బిరుదు.. నెట్టింట్లో వీడియో వైరల్
శ్యామ్ సింగ రాయ్ జీవితం గురించి నాని తీవ్రంగా రీసెర్చ్ చేస్తాడు. ఈ క్రమంలో అతడు అనుకోకుండా శ్యామ్ సింగ రాయ్ లా ప్రవర్తించడం మొదలుపెట్టాడట. నానిలోకి ఒకప్పటి శ్యామ్ సింగరాయ్ ఆత్మ ప్రవేశిస్తుంది. సినిమా డైరెక్టర్ నాని శ్యామ్ సింగరాయ్ లా ప్రవర్తించడం అందరినీ షాక్ కి గురిచేస్తుందట.కాగా రజినీకాంత్ చంద్రముఖి నేపథ్యం కూడా ఇదే. చంద్రముఖి పట్ల ఆకర్షితురాలైన గంగ(జ్యోతిక) ఆమె గురించి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో తనని తాను చంద్రముఖిగా ఊహించుకుంటుంది. చంద్రముఖి సులభంగా గంగలోకి ప్రవేశిస్తుంది. నాని శ్యామ్ సింగరాయ్ కథలో కూడా ఇలాంటి షేడ్స్ ఉంటాయట. మరి ఈ కథనాల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదట కానీ, భారీగా ప్రచారమవుతోంది.
దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్ శ్యామ్ సింగరాయ్ చిత్రానికి దర్శకుడు. సాయి పల్లవి,కృతి శెట్టి ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నాని కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ ఈ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read: Sitara Krishna: సూపర్ స్టార్ తాతతో మహేష్ బాబు కూతురు లంచ్ డేట్