Nallari Kiran Kumar Reddy: నల్లారి కిరణ్ చంద్రబాబు వదిలిన బాణమా?

Nallari Kiran Kumar Reddy: ఏపీ బీజేపీలో హేమాహేమీలు ఉన్నా ఆ పార్టీ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఓట్లు, సీట్లు పెంచుకోలేకపోతోంది. దీంతో పవర్ పాలిటిక్స్ కోసం ఎదురుచూసే చాలా మంది నాయకులు పక్కచూపులు చూస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు పార్టీని వీడారు. మరికొందరూ గుడ్ బై చెప్పేందుకు సిద్ధపడుతున్నారు. ఇటువంటి సమయంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేరడం సాహసంతో కూడుకున్న పని అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ […]

Written By: Dharma, Updated On : April 13, 2023 9:04 am
Follow us on

Nallari Kiran Kumar Reddy

Nallari Kiran Kumar Reddy: ఏపీ బీజేపీలో హేమాహేమీలు ఉన్నా ఆ పార్టీ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఓట్లు, సీట్లు పెంచుకోలేకపోతోంది. దీంతో పవర్ పాలిటిక్స్ కోసం ఎదురుచూసే చాలా మంది నాయకులు పక్కచూపులు చూస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు పార్టీని వీడారు. మరికొందరూ గుడ్ బై చెప్పేందుకు సిద్ధపడుతున్నారు. ఇటువంటి సమయంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేరడం సాహసంతో కూడుకున్న పని అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి దాదాపు పదేళ్లు కావస్తున్నా ఏపీలో ఆ పార్టీకి పట్టు దొరకడం లేదు. ఇటువంటి తరుణంలో కిరణ్ చేరికపై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

గ్రూపుల మధ్య చేరికతో..
అయితే ఇప్పటికే ఏపీ బీజేపీలో మూడు గ్రూపులున్నాయన్న టాక్ ఉంది. పాతతరం నాయకులు స్థిరమైన వర్గంగా ఉండగా.. టీడీపీ, వైసీపీ అనూకుల వర్గాలు ఉన్నాయని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అందుకు తగ్గట్టుగానే సదరు నాయకులు ఇచ్చే స్టేట్ మెంట్స్ అలానే ఉంటాయి. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం టీడీపీనుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. వారితో పాటు అప్పటివరకూ పదవులు అనుభవించిన తాజా మాజీ మంత్రులు సైతం గోడ దూకేశారు. అయితే వీరు చంద్రబాబు ప్రోత్సాహంతోనే కాషాయదళంలోకి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో అటువంటి ప్రచారమే జరుగుతోంది. వైసీపీని ఢీకొట్టడానికి చంద్రబాబే పనిగట్టుకొని కిరణ్ ను పంపించారన్న టాక్ అయితే నడుస్తోంది.

Nallari Kiran Kumar Reddy

విభిన్న వ్యక్తిత్వం..
ఒక రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తి అంతలా పావుగా మారతారని ఎవరూ భావించడం లేదు. పైగా కిరణ్ కు హుందాతనం గల నాయకుడిగా గుర్తింపు ఉంది. సైద్ధాంతిక విభేదాలే తప్ప.. ఎవరితో వ్యక్తిగత, రాజకీయ వైరం పెట్టుకోవడానికి ఇష్టపడరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఫాలోవర్ అయిన కిరణ్ చాలా విషయాలను ఆయన్ను అనుసరిస్తూ ఉంటారు. చంద్రబాబు కుటుంబంతో రాజకీయ వైరం ఉన్నా.. అది వ్యక్తిగతంగానూ ఎప్పుడు చూపించలేదు. మంచి ఫ్రెండ్లీ నేచర్. అయితే కిరణ్ సోదరుడు కిశోర్ టీడీపీలో ఉన్న నేపథ్యంలో ఆ ప్రభావంతో కిరణ్ బీజేపీలో చేరిక వెనుక చంద్రబాబు ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది.

ఆ ఆలోచనతోనే..
ఉమ్మడి ఏపీకి చివరి మూడు సంవత్సరాలు కిరణ్ పాలించారు. పాలనాపరంగా మంచి మార్కులే సొంతం చేసుకున్నారు. కానీ విభజన పాపంతో కాంగ్రెస్ కు గడ్డుకాలం దాపురించింది. అయితే నాడు ఆయన కేబినెట్ లో పనిచేసిన వారంతా ఆయన్ను ఇష్టపడతారు. కాంగ్రెస్ పతనంతో వారు చెట్టుకొకరు.. పుట్టకొకరుగా మిగిలారు. ప్రస్తుతం ఎక్కువ మంది వైసీపీలో కొనసాగుతున్నారు. టీడీపీలోనూ యాక్టివ్ గా పనిచేస్తున్న వారూ ఉన్నారు. బహుశా దానిని పరిగణలోకి తీసుకొని బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి చేర్చుకొని ఉంటుంది తప్ప.. మరి ఏ ఇతరత్రా కారణాలు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు.