Anna Hazare- KCR: ‘దేశ రాజకీయాల్లో భూకంపం సృష్టిస్తా… రాజకీయాల్లో సంచలనం ఉంటుంది… త్వరలోనే ఆ సంచలనం జరుగబోతోంది. తినబోయే ముందు రుచి ఎందుకు అడుగుతారు.. నోమోర్ క్వశ్చన్స్’ దేశవ్యాప్త పర్యటనకు బయల్దేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల చేసిన వ్యాఖ్యలివి. కేసీఆర్ వ్యాఖ్యల్లో అంతరార్థం ఏమిటన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలతోపాటు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఒకింత ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి తోచిన విధంగా వారు సంచనం ఏముంటుందన్న విశ్లేషణ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల తెరపైకి వచ్చిన అంశం రాష్ట్రపతి ఎన్నికలు.. ఈ ఎన్నికల్లోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని దెబ్బకొట్టాలని కేసీఆర్ ఆలోచన అయి ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఇందుకోసం విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని యోచిస్తున్నట్లు సమాచారం.

విపక్ష అభ్యర్థిగా అన్నా హాజారే..
కేంద్రాన్ని దెబ్బకొట్టే అవకాశం కోసం వేచిచూస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికలు ఇందుకు అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం బీజేపీ యేతర పార్టీలను ఏకం చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఎన్డీఏ, యూపీఏ యేతర పార్టీలను ఏకం చేసి.. జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీయడం ద్వారా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోదీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినట్లు అవుతుందని, తన ఆవేశం తగ్గుతుందన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థికా రాజకీయలతో సంబంధం లేని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే పేరు ప్రతిపాదిస్తున్నట్లు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల డిల్లీ వెళ్లిన కేసీఆర్ ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌కేజ్రీవాల్‌తోపాటు, కర్నాటకకు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడకు ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. అన్నా హజారేతో కూడా సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఆయన హజారేను కలువలేకపోయారు.
Also Read: Visakhapatnam YCP: విశాఖ వైసీపీలో కుమ్ములాటలు.. ఆధిపత్యం కోసం నేతల ఆరాటం
ప్రతిపక్షాలన్నీ ఏకమైతేనే కేసీఆర్ లక్ష్యం నెరవేరుతుంది..
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీకి అన్నా హజారే అంగీకరిస్తారా అన్నది మొదటి ప్రశ్న. సీఎం కేసీఆర్‌గానీ, ఇతర పార్టీల నేతలు గానీ ఇప్పటి వరకు అన్నా హజారేను కలువలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసే ప్రతిపాదనను ఆయనకు తెలియజేయలేదు. అయితే త్వరలో ఆయనను విపక్ష పార్టీలు కలిసి విన్నవించినా 8 పదుల వయసు దాటిన ఆయన పోటీకి అంగీకరిస్తారా అనేది కూడా అనుమానమే. ఇక పోటీకి కూడా అన్నా హజారే సై అన్నా.. విపక్షాల అభ్యర్థిని గెలిపించుకోవడం అంత సులభం ఏమీ కాదు. రాష్ట్ర పతి ఎన్నికల్లో ఓట్ల పరంగా చూస్తే బీజేపీ, బీజేపీ యేతర పార్టీల మధ్య అంతరం పెద్దగా లేదు. కాస్త కష్టపడితే విపక్షాల అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. ఇందు కోసం బీజేపీ ఏతర పార్టీలన్నీ ఏకం కావాలి. లేదా ఎన్డీఏలో చీలిక తీసుకురావాలి. ఈ రెండూ అంత సులభమయ్యే అంశాలు కావు.
బీజేపీ యేతర పార్టీలు వేరు.. ప్రతిపక్ష పార్టీలు వేరు..
బీజేపీ యేతర పార్టీలుగా వైఎస్సార్‌సీసీ, బీజూ జనతాదళ్, తెలుగుదేశం పార్టీ, బీఎస్పీ, శిరోమణి అకాళీదళ్ పార్టీలు ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఈ పార్టీలు మోదీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఏమాత్రం లేదు. ఇక ప్రతిపక్ష పార్టీల విషయానికి వస్తే కాం్రVð స్, వామపక్షాలు, తృనమోల్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ఎస్పీ, ఆర్జేడీ ఆప్ పార్టీలు ఉన్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావడం అంత సులభం కాదు. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆప్ ప్రతిపక్షాలతో కలిసి వచ్చే అవకాశం లేదు.

అందరినీ ఏకం చేస్తే కేసీఆర్‌కు తిరుగులేని మైలేజీ…
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలతోపాటు, ప్రతిపక్షాలను ఏకం చేయడం ద్వారా బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని సులభంగా ఓడించవచ్చు. దేశ రాజకీయాల్లో మార్పు తెస్తానని, ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని, విపక్షాలు ఏకం కావాలని తరచూ మాట్లాడుతున్న కేసీఆర్‌కు అందరికీ ఏకం చేసేందుకు ఇటీవల దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే.. ముందుగా విపక్షాలు, బీజేపీయేతర పార్టీలే కేసీఆర్‌ను విశ్వసించడం లేదు. ఇందుకు ఇటీవల బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రెస్‌నోట్‌లో టీఆర్‌ఎస్ పేరు ప్రస్తావించకపోవడమే ఇందుకు ఉదాహరణం. ఆటంకాలను అధిగమించి కేసీఆర్ బీజేపీయేతర పక్షాలు, ప్రతిపక్షాలను ఏకం చేయగలిగితే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి ముచ్చెమటలు పట్టించొచ్చు. ఓడించే అవకాశం ఉంటుంది. ఓడించకపోయినా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముచ్చెమటలు పట్టించిన సీఎంగా కేసీఆర్‌కు మైలేజీ వస్తుంది. ఇది తెలంగాణలో ఆయనను హీరోగా నిలబెడుతుంది. జాతీయ రాజకీయాల్లో అందరినీ ఏకం చేస్తే దేశ్‌కీ నేతగా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది.
రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ఇప్పటికే ఇద్దరి పేర్లు..
జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి ప్రస్తుతం ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అందులో ఒకరు ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్. ఈయనకు రాష్ట్రపతిగా పోటీచేసేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన గతంలో ప్రధాని పదవి ఆశించారు. కాగా, శరద్‌పవార్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ కూడా వ్యతిరేకించదు. యూపీయే భాగస్వామ్య పార్టీలూ మద్దతు ఇస్తాయి. ఇక ప్రముఖంగా వినిపించిన మరో పేరు నితీశ్‌కుమార్. ప్రస్తుతం ఆయన ఎన్డీయేలో ఉన్నారు. కానీ కొన్ని విపక్షాలు నితీశ్‌కుమార్‌ను ఎన్డీయేకు దూరం చేసేందుకు నితీశ్‌పేరును తెరపైకి తెచ్చాయి. ఇందుకు ఆయన సముఖంగా ఉన్నా.. ఎన్నికల్లో గెలుస్తాడన్న నమ్మకం మాత్రం లేదు. ఈక్రమంలోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా అన్నా హజారే పేరు తెరపైకి తెచ్చినట్లు సమాచారం. అయితే అన్నా హజారేకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశం లేదు.
అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌పైనే పోరాటం..
అన్నా హజారే యూపీఏ హయాంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం చేశారు. 2014 ఎన్నికల్లో యూపీఏ పతనానికి పరోక్షంగా కారణమయ్యారు. అవినీతి పార్టీగా కాంగ్రెస్‌కు ముద్ర పడడంలో ఆయన పాత్ర కీలకం ఈ నేపథ్యంలో అన్నా హజారే అభ్యర్థిత్వాన్ని దాదాపు కాంగ్రెస్ సమర్థించకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఏది ఏమైనా కేసీఆర్ సంచలనం వ్యాఖ్యల వెనుక వివిధ రకాలుగా చర్చ మాత్రం జరుగుతోంది.
Also Read:CM Jagan Delhi Tour: మోడీతో జగన్.. మధ్యలో తెలంగాణే హాట్ టాపిక్?


[…] Also Read: Anna Hazare- KCR: కేసీఆర్ సంచలనం అదేనా?… విపక్ష… […]