Kanna Laxminarayana : కన్నాకు బీజేపీ ఏం తక్కువ చేసింది.. ఆయన స్వయంకుృతపారాదం ఏంటి?

Kanna Laxminarayana vs BJP : కన్నా లక్ష్మీనారాయణ.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రానికి 15 ఏళ్లు మంత్రిగా కూడా చేశారు. కన్నా లక్ష్మీనారాయణ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నేత. కాంగ్రెస్ లో కీలక పదవులు చేపట్టారు. గత ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. వైసీపీలో చేరుతారని భావించినా.. బీజేపీ హైకమాండ్ ఇచ్చిన ఆఫర్ తో ఆ పార్టీలో చేరారు. ఇలా చేరిన కొద్దిరోజులకే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. గత ఎన్నికల […]

Written By: NARESH, Updated On : February 17, 2023 3:38 pm
Follow us on

Kanna Laxminarayana vs BJP : కన్నా లక్ష్మీనారాయణ.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రానికి 15 ఏళ్లు మంత్రిగా కూడా చేశారు. కన్నా లక్ష్మీనారాయణ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నేత. కాంగ్రెస్ లో కీలక పదవులు చేపట్టారు. గత ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. వైసీపీలో చేరుతారని భావించినా.. బీజేపీ హైకమాండ్ ఇచ్చిన ఆఫర్ తో ఆ పార్టీలో చేరారు. ఇలా చేరిన కొద్దిరోజులకే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. గత ఎన్నికల తరువాత కన్నా చొరవతోనే జనసేన, బీజేపీ మిత్రులుగా మారాయి. కానీ ఆయన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి సోము వీర్రాజుకు అప్పగించారు. అప్పటి నుంచి కాస్త ముభావంతోనే ఉన్నారు. పార్టీలో కూడా ఏమంత యాక్టివ్ గా లేరు.

ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ అధిష్టానం కన్నా లక్ష్మీనారాయణను దించేసి ఆర్ఎస్ఎస్ వాది.. ఫైర్ బ్రాండ్ అయిన సోము వీర్రాజుకు పగ్గాలు అప్పజెప్పడాన్ని అటు కన్నా లక్ష్మీనారాయణతోపాటు ఆయన అనుచరులు.. ఇటు టీడీపీ కూడా జీర్ణించుకోలేకపోతోంది. ఎందుకంటే కన్నా వెనుక టీడీపీ ఉందని.. చంద్రబాబే నడిపిస్తున్నాడన్న ప్రచారం ఏపీ రాజకీయాల్లో ఉంది. కన్నా బీజేపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ విధానాల కంటే చంద్రబాబుకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఫక్తు తెలుగుదేశం అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారించిన బీజేపీ హైకమాండ్.. కన్నాను దించేసి స్వతహాగా బీజేపీ వాది అయిన సోము వీర్రాజును రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది.

అయితే ఏపీ రాజకీయాల్లో కన్నాపై ఓ బలమైన విమర్శ ఆయనపదవి పోవడానికి కారణం అన్న చర్చ అప్పట్లో సాగింది. కొద్ది రోజుల కిందట వైసీపీ నేతలు ఒక ఆరోపణ చేశారు. చంద్రబాబు నుంచి రూ.20 కోట్లు కన్నాకు అందాయని, అందుకే కన్నా.. చంద్రబాబు చెప్పినట్లు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుస్తున్నారని ఎంపి విజయసాయిరెడ్డి ఆరోపించారు. అందుకే కరోనా టెస్ట్ కిట్ లపై లేనిపోని రాద్ధంతం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఇదే అంశాన్ని జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా బీజేపీ జనసేన పొత్తు ఉన్నప్పటికీ రెండు పార్టీలను సమన్వయం చేయడంలో కన్నా వైఫల్యం కనిపించింది. ఇప్పటి వరకూ ఏ కార్యక్రమాన్ని రెండు పార్టీలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించలేకపోయాయి. పవన్, కన్నా సమావేశం అవడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి సందర్భాలు అసలు లేవు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యింది. అమరావతి రాజధాని విషయంలో ముందు నుంచి మద్దతుగా కన్నా వ్యవహరిస్తున్నారు. గవర్నర్ వద్దకు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు చేరినప్పడు వాటిని ఆమోదించవద్దని కన్నా లేఖ రాశారు. ఈ వ్యవహారంపై బీజేపీ అదిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది. అదేవిధంగా నిమ్మగడ్డ ను ఎస్ఇసిగా తొలగించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించినప్పడు కన్నా ఆ విషయంలో గవర్నర్ తీరును తప్పుబడుతూ లేఖ రాయడం కూడా బీజేపీకి మండిపోయింది.

మరోవైపు కన్నా లక్ష్మీ నారాయణ నేతృత్వంలో 2019 లో ఎన్నికల్లో బిజెపీ అధిక సంఖ్యలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసింది, కాని ఒక్క సీటు సాధించలేకపోయింది. కనీసం గట్టి పోటీ ఇచ్చిన పరిస్థతి ఎక్కడా కనిపించలేదు. నర్సరావుపేట పార్లమెంట్ స్థానానికి బరిలో నిలిచిన కన్నా డిపాజిట్ కోల్పోయారు. దీంతో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ పూర్తగా చతికలబడినట్లయ్యింది.

ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా తను గెలవలేదు.. బీజేపీ పార్టీని ఏపీలో ఏమాత్రం ముందుకు తీసుకెళ్లలేదు. పైగా చంద్రబాబు కనుసన్నల్లోనే బీజేపీని దెబ్బతీసేలా వ్యవహరించారన్న ప్రచారం కన్నా విషయంలో జరిగింది. అందుకే అప్పుడు తీసేసి పక్కనపెట్టేసింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు చక్రం తిప్పారు. కన్నాకు గుంటూరు వెస్ట్ తోపాటు ఆయన వర్గానికి సీట్ల హామీ ఇచ్చారు. ఇన్నాళ్లు బీజేపీలో చంద్రబాబు కోవర్ట్ లా ఉన్నాడని ఆరోపణలు ఎదుర్కొన్న కన్నా ఇప్పుడు స్వతహాగా అదే బీజేపీపై నాలుగు విమర్శలు చేసి బయటపడ్డాడన్న చర్చ సాగుతోంది.

అయితే కన్నా బయటకు వస్తూ వస్తూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలే కారణమంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబు హామీ ఇవ్వడంతోనే కన్నా ఇలా చెలరేగి సోము వీర్రాజు,జీవీఎల్ పై ఇలా నోరు పారేసుకుంటున్నాడని అంటున్నారు. మొత్తంగా ఎన్నో అవకాశాలు.. అధికారం ఇచ్చినా కూడా తనను తాను కన్నా నిరూపించుకోలేదు. బీజేపీకి కన్నా ఏం తక్కువ చేసిందని ఆయన పార్టీ మారాడని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. .. కన్నా స్వయంకుృతపారాదమే ఈ దుస్థితికి కారణమంటున్నారు.