అందుకు జేపీ నడ్డానే కారకుడా..?

బీజేపీ జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డా. పదవీబాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయ్యింది. అయితే అతడికి పార్టీ నుంచి పెను సవాల్లే లే ముందున్నాయి. బీజేపీ వైఫల్యాలు.. ఎదురవుతున్న కష్టాలు.. ఇప్పుడు నడ్డా చుట్టూ తిరుగుతున్నాయి. జేపీ నడ్డాకు పార్టీలో మంచి వ్యూహకర్తగా పేరుంది. దీనికి తోడు ప్రధాని నరేంద్రమోదీ.. హోంమంత్రి అమిత్ షాకు అత్యంత విశ్వాసపాత్రుడు అన్న పేరు ఉంది. అదుకే అమిత్ షా జేపీ నడ్డాకు అధ్యక్ష పదవి లభించింది. Also Read: భారత జవాన్ల చేతిలో […]

Written By: Srinivas, Updated On : February 12, 2021 10:35 am
Follow us on


బీజేపీ జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డా. పదవీబాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయ్యింది. అయితే అతడికి పార్టీ నుంచి పెను సవాల్లే లే ముందున్నాయి. బీజేపీ వైఫల్యాలు.. ఎదురవుతున్న కష్టాలు.. ఇప్పుడు నడ్డా చుట్టూ తిరుగుతున్నాయి. జేపీ నడ్డాకు పార్టీలో మంచి వ్యూహకర్తగా పేరుంది. దీనికి తోడు ప్రధాని నరేంద్రమోదీ.. హోంమంత్రి అమిత్ షాకు అత్యంత విశ్వాసపాత్రుడు అన్న పేరు ఉంది. అదుకే అమిత్ షా జేపీ నడ్డాకు అధ్యక్ష పదవి లభించింది.

Also Read: భారత జవాన్ల చేతిలో చచ్చిన చైనా జవాన్ల సంఖ్య 45

జేపీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత తొలి ఎన్నికలో ఓటమి ఎదురైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. హరియాణాలోనూ చచ్చీచెడీ గెలవాల్సి వచ్చింది. ఇక బీహర్లో జరిగిన ఎన్నికలలోనూ పరాజయాన్ని తృటిలో తప్పించుకుంది. ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. బిహార్లో అధికారంలోకి వచ్చినా.. అది గెలుపు కాదన్నది అందరికీ తెలుసు. ఇలా జేపీ నడ్డా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కమలం పార్టీ పెద్దగా విజయాలను నమోదు చేయలేదు.

ఇక త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలంగా ఉంటుందన్న నమ్మకం ఉన్నది కేవలం పశ్చిమ బెంగాల్, అస్సాంలోనే.. మిగిలిన రాష్ట్రాల్లో సోదిలో కూడా ఉండదని విశ్లేషకులు అంటున్నారు. దీంతో జేపీ నడ్డా నాయకత్వంలో పార్టీ ఎన్నిచోట్ల గెలుస్తుందన్న ఆసక్తికర చర్చ ఇప్పుడు జరుగుతోంది.

Also Read: కమలానికి కష్టకాలమేనా..?

అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వరుస విజయాలతో బీజేపీని ఓ రేంజ్ కి తీసుకెళ్లారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. జేపీ నడ్డా నేతృత్వంలో వరుస ఓటమి తప్పేలా లేదు. సహజంగా విజయం సాధిస్తే.. అది మోదీ.. అమిత్ షాల పరం అవుతుంది. అదే ఓటమి అయితే.. ఆ పాపం భరించడానికి జేపీ నడ్డా ఉన్నారు. దీంతో పార్టీలో జేపీ నడ్డా మరికొద్ది నెలల పాటు ఎదురుకానున్న ఓటమిల పాపం భరించేందుకు సిద్ధంగా ఉండాలని సోషల్ మీడియా మిత్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్