చంద్రబాబుకు జూ.ఎన్టీఆర్ వెన్నుపోటు సాధ్యమేనా?

సీనియర్ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కున్నారు చంద్రబాబు. పరిణామాలు ఏవైనా కానీ నందమూరి పార్టీ కాస్తా నారా పార్టీ అయిపోయింది. ఇప్పుడు అదే పునరావృతం అవుతోందా? అంటే ఔననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ నామజపం మొదలైంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు ముందే జూ.ఎన్టీఆర్ రావాలని కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబుపై, లోకేష్ పై వారికి ఏమాత్రం నమ్మకం లేదన్న సంగతి అర్థమైంది. అందుకే ఇప్పుడు […]

Written By: NARESH, Updated On : June 22, 2021 10:38 am
Follow us on

సీనియర్ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కున్నారు చంద్రబాబు. పరిణామాలు ఏవైనా కానీ నందమూరి పార్టీ కాస్తా నారా పార్టీ అయిపోయింది. ఇప్పుడు అదే పునరావృతం అవుతోందా? అంటే ఔననే అంటున్నాయి టీడీపీ వర్గాలు.

తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ నామజపం మొదలైంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు ముందే జూ.ఎన్టీఆర్ రావాలని కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబుపై, లోకేష్ పై వారికి ఏమాత్రం నమ్మకం లేదన్న సంగతి అర్థమైంది. అందుకే ఇప్పుడు వెన్నుపోటు రాజకీయం మళ్లీ రాజుకుంది.

ఏపీ మంత్రి పేర్ని నాని తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. లోకేష్ తన రాజకీయ అపరిపక్వతను కప్పిపుచ్చడానికే సీఎం జగన్ పై నోరుపారేసుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారని.. టీడీపీలో రాజుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ జపాన్ని తగ్గించడానికే ఈ దృష్టి మళ్లిస్తున్నాడని ఆరోపించారు.

నిజానికి చంద్రబాబు-లోకేష్ లను ఎప్పుడో ఒక్కప్పుడు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కుంటాడని ఏపీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.

చంద్రబాబు తర్వాత పగ్గాలు లోకేష్ కే. కానీ ఆయనకు అంత సామర్థ్యం లేదని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రావాలంటున్నారు. కానీ జూనియర్ మాత్రం చంద్రబాబు పని అయిపోయాక.. ఆయన వృద్ధాప్యంతో పార్టీకి దూరమయ్యాకే ఈ పనిచేసేలా ఉన్నారు. ఆరోజు తప్పకుండా వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.