https://oktelugu.com/

Jagan Cabinet: కొత్త కేబినేట్ ఇలా ఉండబోతుందా..?

Jagan Cabinet:  ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న మంత్రి వర్గాన్ని రాజీనామా చేయించి కొత్త పాలక వర్గంతో ప్రమాణం చేయించనున్నారు. అయితే గతంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగానే కేబినెట్ ను పునర్వ్యస్థీకరించబోతున్నట్లు సీఎం జగన్ మంత్రివర్గ సమావేశంలో తెలిపారు. ఈమేరకు వెలగపూడిలోని సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో జగన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అలాగే త్వరలో జరిగే రాజకీయ పరిణామాలపై కూడా చర్చించారు. అయితే పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రులంతా రాజీనామా పత్రాలను అందించారు. వీటిని […]

Written By:
  • NARESH
  • , Updated On : April 8, 2022 / 08:53 AM IST
    Follow us on

    Jagan Cabinet:  ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న మంత్రి వర్గాన్ని రాజీనామా చేయించి కొత్త పాలక వర్గంతో ప్రమాణం చేయించనున్నారు. అయితే గతంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగానే కేబినెట్ ను పునర్వ్యస్థీకరించబోతున్నట్లు సీఎం జగన్ మంత్రివర్గ సమావేశంలో తెలిపారు. ఈమేరకు వెలగపూడిలోని సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో జగన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అలాగే త్వరలో జరిగే రాజకీయ పరిణామాలపై కూడా చర్చించారు. అయితే పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రులంతా రాజీనామా పత్రాలను అందించారు. వీటిని ప్రత్యేక వాహనంలో రాజ్ భవన్ ను తీసుకెళ్లారు. ఇక 10వ తేదీన కొత్త మంత్రివర్గం అధికారిక ప్రకటన చేసి 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

    మాజీ మంత్రులుగా మారిన  వారంతా తాము సంతోషంగా రాజీనామా చేశామని పైకి చెప్పినా వారు బయటకు వచ్చిన విధానం.. వాడిపోయిన వారి ముఖాలు చూస్తే ఎవరూ ఆనందంగా లేరన్న విషయం అర్థమైంది.. ‘‘రెండున్నరేళ్లు మంత్రి పదవిలో ఉంటారని మాకు ముందే చెప్పారు. అందువల్ల మాకెలాంటి బాధ లేదు. అయితే కొత్త మంత్రుల గురించి మాకు చెప్పలేదు. కొంతమందిని ఇప్పుడున్నవాళ్లలో కొనసాగిస్తామని  అంటున్నారు. అందులో ఎవరు ఉంటారో తెలియదు. మంత్రి వర్గం రాజీనామా గురించి ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు’’ అని ఓ మంత్రి మీడియాకు వెల్లడించారు. అయితే గవర్నర్ ఈ రాజీనామాలను ఆమోదించడంతో వీరంతా మాజీలుగా మారుతారు.

    కొత్త మంత్రి వర్గంలో కుల సమీకరణాలు ఎక్కువగా ఉంటాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం 24 మంది మంత్రుల్లో అన్ని కులాలకు చెందిన వారున్నారు. వీరిలో నలుగురు రెడ్లు, నలుగురు కాపులు ఉన్నారు. కొత్త మంత్రి వర్గంలోకూడా ఈ వర్గానికి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. అయితే నాలుగు చొప్పున కాకుండా మూడేసి చొప్పున కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. బీసీలకు ఆరు సీట్లు ఉండగా వాటిని 8కి పెంచే అవకాశం ఉందని అంటున్నారు.

    ఇక ఇప్పుడున్నవారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. వారి స్థానంలో కొత్తవారికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ , బీసీ కులాల మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. ఇక ఎస్టీ తెగల నుంచి కేబినెట్లో ఒక్కరే ఉన్నారు. ఈ సంఖ్య రెండుకి పెంచే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికలకు అనుగుణంగా ఎస్టీ, ఎస్టీ బీసీలకు కేబినేట్ బెర్తులు అదనంగా కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది. ఇక ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా కొనసాగిస్తారు. మొత్తంగా కమ్మ, వైశ్య, క్షత్రియ కులాలకు అవకాశాలు లేనట్లే తెలుస్తోంది. ఇప్పుడీ కులాలకు చెందిన వారు ఒక్కొక్కరుగా ఉన్నారు. కొత్త కేబినెట్లో వీరు ఉండే అవకాశాలు తక్కవే అంటున్నారు.

    సమాచార శాఖ మంత్రి పేర్ని నానికి మరోసారి అవకాశం లేనట్లే తెలుస్తోంది. ఎందుకంటే తమ మంత్రి కాలంలో సహకరించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. అంతేకాకుండా ఆయన విలేకరులకు విందు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా సీదిరి అప్పల్రాజు, చెల్లులోబయిన వేణు వంటి నేతలను ఇతర మంత్రులు అభినందించారు. అంటే వారు పూర్తీకాలం పదవి దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

    మొత్తంగా ఇప్పుడున్న మంత్రుల్లో ఎస్సీ, బీసీ వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ప్రకటించిన ప్రకారమే జగన్ నిర్ణయం తీసుకోవడంతో రాజీనామా చేసిన వారిలో ఎలాంటి అసంతృప్తి లేకుండా పోయింది. అయితే కొత్తవారిలో ఎవరు దక్కించుకుంటారోన్న ఆసక్తి అందరిలో నెలకొంది.