Homeఆంధ్రప్రదేశ్‌జగన్ ఆ నేతలకు ప్రాధాన్యత ఇచ్చి తప్పు చేస్తున్నాడా...?

జగన్ ఆ నేతలకు ప్రాధాన్యత ఇచ్చి తప్పు చేస్తున్నాడా…?

is Jagan making a mistake by giving priority to those leaders

సాధారణంగా ఏ రాజకీయ పార్టీలో అయినా పని చేసే నేతలకు, ప్రజల్లో గుర్తింపు ఉన్న నేతలకు ప్రాధాన్యత దక్కుతుందనే సంగతి తెలిసిందే. అయితే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఔట్ డేటెడ్ నేతలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని… జగన్ ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో పార్టీకి నష్టం కలుగుతుందని ఆ పార్టీ ముఖ్య నేతలు, శ్రేయోభిలాషులు భావిస్తున్నారు.

Also Read : ఏపీ జనాలకు జగన్ కన్నా మోదీ పైనే నమ్మకం ఎక్కువా..? 

జగన్ పార్టీలో చేర్చుకుంటున్న వారిలో ఒక్కరికి కూడా ప్రజల్లో పెద్దగా గుర్తింపు లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు తిరస్కరించిన నేతలను పార్టీలో చేర్చుకుంటే పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖకు చెందిన పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబును జగన్ కొన్ని రోజుల క్రితం పార్టీలో చేర్చుకున్నారు. గంటాకు సన్నిహితుడుగా పేరు పొందిన పంచకర్లకు ప్రజల్లో పెద్దగా గుర్తింపు లేదు.

ఈయన వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదని ఇలాంటి రాజకీయ నాయకులను జగన్ ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారో అర్థం కావడం లేదని వైసీపీ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. రాజమండ్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ ను కూడా జగన్ పార్టీలో చేర్చుకున్నారు. ఆయన కుటుంబానికి మేయర్ పదవి ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీ నేతలకే నచ్చడం లేదు.

ఒకప్పుడు వైసీపీకి బద్ధ శత్రువుగా వ్యవహరించిన క‌డ‌ప జిల్లా జ‌మ్మల‌మ‌డుగుకు చెందిన రామసుబ్బారెడ్డిని సైతం జగన్ పార్టీలో చేర్చుకున్నారు. ఈయనను పార్టీలో చేర్చుకోవడంపై జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. కొన్ని నెలల క్రితమే జగన్ తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులును పార్టీలో చేర్చుకున్నారు. ఈయన వల్ల పార్టీకి పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. ఇలాంటి నేతలకు జగన్ ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీ కోసం పని చేసేవారికి ప్రాధాన్యత ఇస్తే మంచిదని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి..

Also Read  : ఏపీ మళ్లీ నంబర్ 1.. కేంద్రం ప్రకటన

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

1 COMMENT

Comments are closed.

Exit mobile version